Monday, July 13, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్బాల్య మిత్రుడి కుటుంబానికి ఆర్థిక సాయం

బాల్య మిత్రుడి కుటుంబానికి ఆర్థిక సాయం

- Advertisement -

నవతెలంగాణ -పెద్దవంగర : చిన్ననాటి జ్ఞాపకాలు కళ్లముందే కదిలాయి… బాల్య మిత్రుడి మృతి వార్త తోటి స్నేహితుల గుండెల్ని పిండేసింది. కలిసి ఆడిన రోజులు, పంచుకున్న అనుబంధం ఒక్కసారిగా జ్ఞాపకాలై మిగిలిపోవడంతో మిత్రులు కన్నీరుమున్నీరయ్యారు. మహబూబాబాద్ జిల్లా, పెద్దవంగర మండల కేంద్రానికి చెందిన చిలుక  తిమెతి (50) ఇటీవల అనారోగ్యంతో మృతి చెందాడు.‌ విషయం తెలుసుకున్న 1991-92 పదో తరగతి విద్యార్థులు మృతుడి కుటుంబాన్ని పరామర్శించి, రూ. 20 వేల ఆర్థిక సాయం అందజేశారు. బాధిత కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేసి, ధైర్యం చెప్పారు. బాల్య మిత్రులు సురేందర్, వేణు రెడ్డి, షేక్ ఫరీద్, స్వామి మాట్లాడుతూ బాల్య స్నేహం జీవితాంతం నిలిచే బంధం అన్నారు. మిత్రుడిని తిరిగి తీసుకురాలేకపోయినా అతని కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. స్నేహితునితో గడిపిన జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు. ఈ మానవీయ చర్యపై గ్రామస్థులు హర్షం వ్యక్తం చేశారు. ఇలాంటి సహాయ కార్యక్రమాలు మరెందరికో ఆదర్శంగా నిలుస్తాయని పేర్కొన్నారు. కార్యక్రమంలో శ్రీనివాస్ రెడ్డి, కవిరాజు, శ్రీనివాస్, నాగయ్య, జనార్ధన్, వెంకటేశం, మృత్యుంజయ శర్మ, జనార్దన్, ప్రవీణ్ కుమార్, ఎండీ మహిపాషా, సాంబయ్య, రామకృష్ణ, రామనాధం, రాము తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -