- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : దక్షిణ ఢిల్లీలోని గ్రేటర్ కైలాష్-I లోని సల్మాన్ ఖాన్ బ్రాండ్ జిమ్‌లో గురువారం రాత్రి అగ్నిప్రమాదం సంభవించింది. పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సకాలంలో స్పందించి జిమ్‌లో ఉన్న వారిని సురక్షితంగా బయటకు తరలించారు. షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ ప్రమాదం జరిగి ఉండవచ్చని ప్రాథమికంగా భావిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రాణనష్టం లేదా గాయాలు కాలేదు.
- Advertisement -


