- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండలం అంబటిపల్లి గ్రామంలోని మేడిగడ్డ బ్యారేజ్‌కు గురువారం 81,060 క్యూసెక్కుల వరద ప్రవాహం చేరింది. భారీ నీటిపారుదల శాఖ అధికారులు బ్యారేజ్‌లోని 85 గేట్లను ఎత్తి అంతే మొత్తంలో నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. గత మూడు రోజులుగా కురుస్తున్న ఎడతెరిపి వర్షాల కారణంగా బ్యారేజీకి వరద మరింత పెరిగే అవకాశం ఉందని, లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అవసరమైతే తప్ప బయటకు రావద్దని అధికారులు సూచించారు.
- Advertisement -



