Wednesday, August 26, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంసెకన్ ల్లో భవనాన్ని చుట్టేసిన వరద..వీడియో

సెకన్ ల్లో భవనాన్ని చుట్టేసిన వరద..వీడియో

- Advertisement -

నవతెలంగాణ-హైదరాబాద్: నేపాల్‌లోని రసువా జిల్లాలో వరదలు బీభత్సం సృష్టించాయి. భారీ వర్షాలకు భోటే కోషి నదికి వరద నీరు ముంచుకొచ్చింది. ఆ నది ఎగువ ప్రాంతం నుండి దూసుకొచ్చిన వరదనీటిలో బురద, రాళ్లు, శిథిలాలు ఉధృతంగా దూసుకువచ్చి ఓ పార్కింగ్ స్థలంలో ఉన్న భారీ భవనాన్ని రెప్పపాటులో కమ్మేశాయి. ఆ వరద ధాటికి పలు వాహనాలతో పాటు పలువురు వ్యక్తులు నీటిలో గల్లంతు అయ్యారు. ఈ ప్రమాద దృశ్యాలు ఓ సీసీటీవీ కెమెరాలో నమోదు అయ్యాయి. ప్రస్తుతం సదురు వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -