- Advertisement -
నన్ను దహించే ఫీనిక్స్ ఆలోచనలు..
పచ్చని పొలాల్ని బూడిద చేస్తూ
ఒంటరితనపు సెగల కార్చిచ్చు!
ఉప్పొంగే జీవనదులలో
విషపు కత్తుల వికటాట్టహాసం!
నిద్రలేని తుపాకీ కళ్ళ ముందు..
పూల బండిలో
మారణాయుధాల వ్యాపారం!
ఆ నెత్తుటి వ్యాపారపు సెగల్లో..
ఇప్పుడు నేను..
సమాధి చేయబడిన గంధర్వ గానాన్ని!
విషపు మడుగులో విలపిస్తున్న
నక్షత్ర శకలాన్ని!
కానీ, ఈ గాయాల గర్భంలోంచే..
చైతన్యపు దివిటీతో..
అవమానాల చీకటి పొరల నుండి
రాతి అలలను చీల్చుకుంటూ
ఆత్మగౌరవపు వెలుగు వైపుకు..
సాగిపోతున్న సరంగును నేను!
విల్సన్ రావు కొమ్మవరపు, 89854 35515
- Advertisement -



