Saturday, August 22, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంమాజీ బాక్సింగ్ ప్రపంచ ఛాంపియన్ దారుణ హత్య

మాజీ బాక్సింగ్ ప్రపంచ ఛాంపియన్ దారుణ హత్య

- Advertisement -

నవతెలంగాణ-హైదరాబాద్ : దక్షిణాఫ్రికాకు చెందిన మాజీ ప్రపంచ ఛాంపియన్ బాక్సర్ జోలాని టెటే (38) హత్యకు గురయ్యారు. ఈ విషయాన్ని శనివారం ఆ దేశ క్రీడాశాఖ మంత్రి గైటన్ మెకెంజీ ప్రకటించారు. ఈస్టర్న్ కేప్‌లోని మ్డాంట్సానేలో టెటే తన కారులో ఇంటికి చేరుకుని గేటు తెరుచుకునేందుకు వేచి ఉండగా, ముసుగులు ధరించిన ఇద్దరు దుండగులు ఆయనపై కాల్పులు జరిపినట్లు పోలీసులు తెలిపారు. ఘటనలో కారులో ఉన్న 27 ఏళ్ల మహిళకు కూడా తీవ్ర గాయాలయ్యాయి. టెటే తన కెరీర్‌లో WBF ఫ్లైవెయిట్, WBO బాంటమ్‌వెయిట్ విభాగంలో ప్రపంచ టైటిల్ బెల్ట్‌లను గెలుచుకున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -