Wednesday, August 26, 2026
E-PAPER
Homeఖమ్మంపోలీస్‌ ఉద్యోగాలకు ఉచిత శిక్షణ

పోలీస్‌ ఉద్యోగాలకు ఉచిత శిక్షణ

- Advertisement -

– ఎస్.హెచ్.ఓ ఎస్ ఐ యయాతి రాజు 
నవతెలంగాణ – అశ్వారావుపేట

పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌లో కానిస్టేబుల్‌, ఎస్సై ఉద్యోగాలకు సిద్ధమవుతున్న నిరుద్యోగ యువతీ యువకులకు ఉచిత శిక్షణ, వసతి కల్పించనున్నట్లు అశ్వారావుపేట ఎస్.హెచ్.ఓ ఎస్‌ఐ టి. యయాతి రాజు తెలిపారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్‌ రాజ్‌, ఐపీఎస్‌ సూచనల మేరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.బుధవారం తన కార్యాలయంలో నుండి పత్రికా ప్రకటన ఒకటి విడుదల చేసారు. అశ్వారావుపేట పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని ఆసక్తి ఉన్న అభ్యర్థులు దరఖాస్తు ఫారాలను పూర్తిగా నింపి ఈ నెల 30వ తేదీ సాయంత్రం 5 గంటల్లోగా అశ్వారావుపేట పోలీస్‌ స్టేషన్‌లో సమర్పించాలని సూచించారు. అభ్యర్థులకు సెప్టెంబర్‌ 6 న ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నట్లు తెలిపారు. ప్రవేశ పరీక్షలో అర్హత సాధించిన వారికి ఉచిత శిక్షణతో పాటు ఉచిత రెసిడెన్షియల్‌ సౌకర్యం కల్పించి పోలీస్‌ శాఖ పోటీ పరీక్షలకు ప్రత్యేక శిక్షణ అందించనున్నట్లు ఎస్‌ఐ తెలిపారు. అర్హత, ఆసక్తి ఉన్న యువతీ యువకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -