Thursday, July 9, 2026
E-PAPER
Homeక్రైమ్ గంజాయి విక్రయాల గుట్టురట్టు..

 గంజాయి విక్రయాల గుట్టురట్టు..

- Advertisement -

నవతెలంగాణ – భీంగల్ 
గంజాయిని చిన్న చిన్న ప్యాకెట్లుగా చేసి మండల పరిధిలోని ప్రజలకు అమ్ముతున్న వ్యక్తిని గురువారం పోలీసులు అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చత్తీస్ ఘడ్ లోని బీజాపూర్ జిల్లా మాడెడ్ మండలంలోని సోమన్పల్లికి చెందిన లక్ష్మయ్య కొన్ని రోజుల క్రితం మండల కేంద్రానికి వలస వచ్చాడు. అతడు భవన నిర్మాణ కార్మికుడిగా పనిచేస్తూనే ఎండు గంజాయిని చిన్న చిన్న ప్యాకెట్లుగా చేసి తరుచూ విక్రయిస్తున్నాడని పేర్కొన్నారు. ఈ క్రమంలో పక్కా సమాచారంతో గంజాయి అమ్ముతున్న లక్ష్మయ్యను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నామని చెప్పారు. గంజాయి ప్యాకెట్ లను రూ. 500 లకు అమ్ముతున్నాడని, అతని వద్ద 116 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నామని వెల్లడించారు. నిందితుడిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించామని తెలిపారు. మరోవైపు లక్ష్మయ్య స్నేహితులైన ముగ్గురుని ఎంఆర్ఓ ఎదుట హాజరుపరిచి, బైండోవర్ చేసినట్టు అధికారులు చెప్పారు. కార్యక్రమంలో అబ్కారీ ఇన్‌స్పెక్టర్ పి. వేణు మాధవరావు, సబ్‌ఇన్‌స్పెక్టర్ కె. గోవర్ధన్, కానిస్టేబుళ్లు సాయన్న, దేవేందర్, బి. చంద్రశేఖర్, హెడ్ కానిస్టేబుల్ వాహిదుద్దీన్ పాల్గొన్నారు.



- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -