Monday, August 24, 2026
E-PAPER
Homeతాజా వార్తలులిఫ్ట్‌లో ఇరుక్కుని బాలిక మృతి

లిఫ్ట్‌లో ఇరుక్కుని బాలిక మృతి

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో విషాదం చోటుచేసుకుంది. ఆడుకోవడానికి పక్కింటికి వెళ్లిన ఓ బాలిక లిఫ్ట్‌లో ఇరుక్కుని ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటన కొత్తపేట కాలనీలో జరిగింది. వివరాల్లోకి వెళితే.. కొత్తపేటకు చెందిన రేవతి (12) ఆదివారం సాయంత్రం పక్కింట్లో తన స్నేహితులతో ఆడుకోవడానికి వెళ్లింది. అపార్ట్‌మెంట్‌లోని లిఫ్ట్ వద్ద ఆడుకుంటున్న సమయంలో ప్రమాదవశాత్తు అందులో ఇరుక్కుపోయింది. తీవ్ర గాయాలతో రక్తపు మడుగులో పడి ఉన్న రేవతిని చూసిన స్థానికులు వెంటనే స్పందించినా, అప్పటికే బాలిక మృతి చెందింది.

ఆడుకోవడానికి వెళ్లిన తమ కుమార్తె నిమిషాల వ్యవధిలోనే విగతజీవిగా మారడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఈ ఘటనపై మృతురాలి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేస్తూ, తమ కుమార్తె మృతిపై అనుమానాలు వ్యక్తం చేశారు. కేవలం ప్రమాదవశాత్తు ఇలా జరగలేదని, దీని వెనుక వేరే కారణాలు ఉండవచ్చని ఆమె ఆరోపించారు. దీంతో ఈ ఘటనకు కొత్త కోణం తోడైంది. ఆ ఇంట్లో లిఫ్ట్ ను కొన్నిరోజుల కిందటే ఏర్పాటు చేశారు. తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి, అనుమానాస్పద మృతికింద కేసు నమోదు చేశారు. అపార్ట్‌మెంట్‌లోని సీసీటీవీ ఫుటేజీని స్వాధీనం చేసుకుని పరిశీలిస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -