నవతెలంగాణ -పెద్దవంగర
అర్హులైన ప్రతి కుటుంబానికి ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలు అందించడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి అన్నారు. పెద్దవంగర మండల కేంద్రంలోని రైతు వేదికలో సోమవారం వివిధ గ్రామాలకు చెందిన అర్హులైన లబ్ధిదారులకు ఆహార భద్రత స్మార్ట్ రేషన్ కార్డులను ఆమె పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పేద ప్రజల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తోందన్నారు.
రాష్ట్రంలో పారదర్శకంగా స్మార్ట్ రేషన్ కార్డులను అందజేస్తున్నామని, అర్హత ఉన్న ప్రతి కుటుంబానికి ప్రభుత్వ పథకాల ఫలాలు చేరేలా ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందన్నారు. స్మార్ట్ రేషన్ కార్డుల ద్వారా లబ్ధిదారులకు మెరుగైన సేవలు అందడంతో పాటు సంక్షేమ పథకాల అమలు మరింత పారదర్శకంగా, సులభతరంగా మారుతుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్ బలభద్ర వినోద్ కుమార్, ఎంపీడీవో సురేష్, మండల వ్యవసాయాధికారి గుగులోత్ స్వామి నాయక్, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు రంగు మురళి గౌడ్, పెద్దవంగర సర్పంచ్ ముద్దసాని పారిజాత సురేష్, నాయకులు రవీందర్ రెడ్డి, సైదులు, పూర్ణచందర్, కుమారస్వామి, వేణు ఆయా గ్రామాల సర్పంచులు వెంకట్ శ్యాం సుందర్ రెడ్డి, శ్రీనివాస్, రమేష్, శ్రీదేవి, యూత్ నాయకులు హరికృష్ణ, మహేష్ తదితరులు పాల్గొన్నారు.



