నవతెలంగాణ-మర్రిగూడ
తమ డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయం ముందు గ్రామపంచాయతీ యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో చేస్తున్న ధర్నా బుధవారం రెండో రోజుకు చేరింది. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి ఏర్పుల యాదయ్య మాట్లాడుతూ.. ప్రభుత్వం జిపి కార్మికుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరారు. అదేవిధంగా జిపి యూనియన్ ఆధ్వర్యంలో ఎంపీఓ రవికుమార్ కు తమ డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ వినతిపత్రం అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో యూనియన్ అధ్యక్షులు రామావత్ రాజు నాయక్, వృత్తిదారుల సంఘం మండల అధ్యక్షులు సల్వోజు రామలింగ చారి, ఊరు పక్క లింగయ్య, పెరుమాండ్ల మంజుల, ఏరుకొండ లచ్చయ్య, ఊరు పక్క నరసింహ, మాడుగుల శీను, లపంగి నరసింహ, లక్ష్మమ్మ,తదితరులు పాల్గొన్నారు.
రెండో రోజుకు చేరిన జీపీ కార్మికుల ధర్నా
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



