నవతెలంగాణ – జుక్కల్
మండలంలోని సావర్గావ్ మాజీ సర్పంచ్ కిషన్ పవర్ సోదరుని కుమార్తె వివాహ కార్యక్రమంలో జహిరాబాద్ మాజీ ఎంపీ బీబీ పాటిల్, జుక్కల్ మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిండే స్థానిక నాయకులతో కలిసి పాల్గొని వధూవరులను ఆశీర్వదించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథులుగా వచ్చిన మాజీ ఎంపీ మాజీ ఎమ్మెల్యేలకు గిరిజన సాంప్రదాయ బద్ధంగా సన్మాన కార్యక్రమం నిర్వహించారు. అదేవిధంగా మండల, జిల్లా స్థాయి, నాయకులకు కూడా సన్మాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చిన ప్రతి ఒక్కరికి మాజీ సర్పంచ్ కిషన్ పవర్ ప్రత్యేక అభినందనలు తెలియజేశారు. మాజీ సర్పంచ్ కిషన్ పవర్ మాట్లాడుతూ మా ఎమ్మెల్యే మా ఎంపీ గారు పేదలకు ఎప్పుడు అందుబాటులో ఉండి మేము నిర్వహించే శుభకార్యాలకు రావడం మాకు మా కుటుంబ సభ్యులకు మా గిరిజన వాసులకు ఎంతో సంతోషాన్ని కలిగించిందని అభిప్రాయపడ్డారు.
మాజీ ఎంపీ, మాజీ ఎమ్మెల్యేలకు ఘన సన్మానం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



