Monday, July 27, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్రెండో విడత ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి భూమిపూజ

రెండో విడత ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి భూమిపూజ

- Advertisement -

నవతెలంగాణ-మద్నూర్
మండలంలోని పెద్ద షక్కర్గ గ్రామంలో రెండో విడత మంజురమైన ఇందిరమ్మ ఇల్లు నిర్మాణానికి ఆ గ్రామ సర్పంచ్ విశాలాక్షి రాం పటేల్ సోమవారం మార్కౌట్ వేయించి, భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. జుక్కల్ ఎమ్మెల్యే తోటా లక్ష్మి కాంతారావు సహకారంతో పెద్ద షక్కర్గా గ్రామంలో అర్హులైన, గుడిసెల్లో నివసించే ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేశారని తెలిపారు. నిరుపేదల సంక్షేమమే ధ్యేయంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పని చేస్తుందని, అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయించడంలో ఎమ్మెల్యే కృషికి సర్పంచ్ ప్రత్యేకంగా అభినందనలు తెలియజేశారు. ఇంటి నిర్మాణం భూమి పూజ కార్యక్రమంలో సలబత్పూర్ ఆంజనేయ స్వామి ఆలయ కమిటీ మాజీ చైర్మన్ రామ్ పటేల్, గ్రామ కార్యదర్శి లక్ష్మణ్, ఇందిరమ్మ లబ్ధిదారులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -