- Advertisement -
నవతెలంగాణ-కోహెడ
మండల కేంద్రంలో పద్మశాలి సేవా సంఘం ఆధ్వర్యంలో నూతన షెడ్ నిర్మాణానికి ఆదివారం భూమిపూజ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా సభ్యులు మాట్లాడుతూ సంఘం అభివృద్ధికి, కులబంధువుల ఐక్యతకు ఈ నూతన షెడ్ వేదికగా నిలవనుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పద్మశాలి సేవా సంఘం మండల అధ్యక్షుడు గొరిట్యాల లక్ష్మణ్, అధ్యక్షుడు గాదాసు శ్రీనివాస్, ఉపాధ్యక్షుడు కొండబత్తిని సతీష్, ప్రధాన కార్యదర్శి నరాల శ్రీకాంత్, కోశాధికారి గాదాసు రమేష్, సహాయ కార్యదర్శి మాటేటి వేణు, కార్యవర్గ సభ్యులు కొండ ప్రశాంత్, గోవిందు సుధీర్, వడ్డేపల్లి ప్రకాష్, వడ్డేపల్లి ప్రసాద్, వడ్డేపల్లి రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -



