Wednesday, September 9, 2026
E-PAPER
Homeరాష్ట్రీయం‌సర్వేయర్ల అరెస్టుకు 
హరీశ్‌‌రావు ఖండన

‌సర్వేయర్ల అరెస్టుకు 
హరీశ్‌‌రావు ఖండన

- Advertisement -

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
లైసెన్స్‌‌డ్‌ సర్వేయర్ల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాల్సింది పోయి, సర్వే భవన్ వద్ద శాంతియుతంగా నిరసన చేస్తున్న వారిని అరెస్ట్ చేయడాన్ని ‌బీఆర్‌ఎస్‌ఎల్పీ ఉపనేత, మాజీమంత్రి టి హరీశ్‌‌రావు తీవ్రంగా ఖండించారు. రూపాయి చెల్లించకుండా రాష్ట్రవ్యాప్తంగా 6,500 మంది సర్వేయర్లు ఏడాది కాలంగా ఎలా జీవించాలనీ, వారి కుటుంబాలను ఎలా పోషించాలని మంగళవారం ఒక ప్రకటనలో ప్రశ్నించారు. అరెస్టులతో సర్వేయర్ల గొంతును అణచివేయడం అప్రజాస్వామికమనీ. వారి సమస్యలకు పరిష్కారం చూపాలని డిమాండ్‌ ‌చేశారు. అరెస్ట్ చేసిన వారిని వెంటనే విడుదల చేయాలనీ, లైసెన్స్‌‌డ్‌ సర్వేయర్లతో ప్రభుత్వం తక్షణమే చర్చలు జరపాలని కోరారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -