Sunday, May 31, 2026
E-PAPER
Homeక్రైమ్చిన్నారిని నేలకేసి కొట్టి చంపాడు..వీడియో

చిన్నారిని నేలకేసి కొట్టి చంపాడు..వీడియో

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : ఉత్తరప్రదేశ్ లోని ఫిరోజాబాద్‌లో అత్యంత హేయమైన, గుండెలవిసే ఘోర ఉదంతం వెలుగులోకి వచ్చింది. ఒక వివాహితను ప్రేమించిన ఉన్మాది..ఆమెతో తన పెళ్లికి ఆ పసివాడు అడ్డంగా ఉన్నాడనే క్రూరమైన ఆలోచనతో కేవలం ఏడాదిన్నర వయసున్న ఆ బాలుడిని నేలకేసి పదే పదే కొట్టి ప్రాణాలు తీశాడు. ఈ ఘాతుకానికి సంబంధించిన హృదయవిదారక సీసీటీవీ ఫుటేజ్ ప్రస్తుతం బయటకు వచ్చి తీవ్ర కలకలం రేపుతోంది. ఆ నిందితుడు నిర్జనంగా ఉన్న ఒక వీధిలో పసిబిడ్డను ఎత్తుకెళ్లి, కిరాతకంగా రోడ్డుపై పదే పదే విసిరికొట్టడం ఆ వీడియోలో రికార్డైంది. ఆ దాడి తర్వాత ఆ చిన్నారి అక్కడికక్కడే నిశ్చలంగా పడిపోయాడు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మరణించిన బాలుడిని సుమిత్, రాతి దంపతుల కుమారుడు ఆరవ్ (కల్లు)గా గుర్తించారు. నిందితుడైన విరాజ్ అనే వ్యక్తి రాతిని ప్రేమించాడని, ఆమెను పెండ్లి చేసుకోవాలని భావించాడని పోలీసులు తెలిపారు. అయితే రాతి ఏడాదిన్నర కుమారుడు తమ బంధానికి, పెండ్లికి అడ్డుగా మారాడని ఆ ఉన్మాది భావించినట్లు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.

శుక్రవారం నాడు రాతి తన పుట్టింటి నుండి ఫిరోజాబాద్‌లోని తన పిన్ని ఇంటికి వచ్చింది. ఆమె అక్కడికి వచ్చినట్లు తెలుసుకున్న నిందితుడు విరాజ్ పక్కా ప్లాన్‌తో ఆ ఇంటికి చేరుకున్నాడు. ఆ చిన్నారికి టాఫీ (చాక్లెట్) కొని ఇస్తానని నమ్మబలికి బయటకు తీసుకువెళ్లాడు. ఆ తర్వాత నిర్మానుష్యంగా ఉన్న వీధిలోకి వెళ్లిన వెంటనే, ఆ పసివాడిని విచక్షణా రహితంగా రోడ్డుపై పదే పదే కిందకేసి కొట్టి తీవ్రంగా గాయపరిచాడు.

ఈ దారుణం గురించి తెలిసిన వెంటనే కుటుంబ సభ్యులు హుటాహుటిన రక్తపు మడుగులో ఉన్న బాలుడిని సమీపంలోని ఆస్ప‌త్రికి తరలించారు. అయితే పరీక్షించిన వైద్యులు ఆ బాలుడు అప్పటికే మృతి చెందినట్లు ప్రకటించారు. సమాచారం అందుకున్న పోలీసులు తక్షణమే ఘటనా స్థలానికి చేరుకుని, మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్ట్‌మార్టం పరీక్షల నిమిత్తం తరలించారు. ఈ అమానుష ఘటనకు పాల్పడిన తర్వాత నిందితుడు విరాజ్ అక్కడి నుండి పరారయ్యాడు. నిందితుడిని పట్టుకునేందుకు పోలీసులు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించి, నగరవ్యాప్తంగా నాకాబంధీ (బారికేడ్లు) ఏర్పాటు చేసి గాలింపు చర్యలను ముమ్మరం చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -