Sunday, August 2, 2026
E-PAPER
Homeకవితగుండె గాయం

గుండె గాయం

- Advertisement -

కన్నీటి చుక్కను కనులలో దాచినవాడే, కవి కాగలడు.
గుండె గాయాన్ని గుండెలో దాచినవాడే,
గాఢమైన పాటగా ప్రపంచాన్ని కదిలించగలడు.
బాధను చూడడమే కాదు…
బాధగా మారినప్పుడే పదానికి ప్రాణం పుడుతుంది.
వేదనను వినడమే కాదు…
వేదనలో జీవించినప్పుడే వాక్యానికి విలువ పెరుగుతుంది.
గాయపడని గుండెకు గాఢమైన గేయం పుట్టదు.
కన్నీరు తడవని కలానికి కరుణారసం కలగదు.
కవి ఊహతో రాయగలడు,
కానీ హదయాన్ని కదిలించే కవిత మాత్రం
అనుభవంతోనే పుడుతుంది.
ఎందుకంటే ప్రతి అక్షరానికి ఆత్మగా నిలిచేది అనుభూతే…
ప్రతి పదానికి ప్రాణం పోసేది ఆవేదనే.
బాధను భరించిన హదయం భావానికి భాష అవుతుంది.
వేదనను వెన్నంటి మోసిన జీవితం
వెలుగునిచ్చే కవిత్వమవుతుంది.
అందుకే…
కన్నీటి రుచి తెలిసిన కలమే
కాలాన్ని తట్టుకునే కవితను రాస్తుంది.
గుండె చప్పుడు విన్న కవియే
గుండెల్లో నిలిచిపోయే పద్యాన్ని సృష్టిస్తాడు.

కోట దామోదర్‌, 9391480475

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -