Monday, September 14, 2026
E-PAPER
Homeజాతీయంకొట్టాయంలో భారీ వర్షాలు

కొట్టాయంలో భారీ వర్షాలు

- Advertisement -

నవతెలంగాణ-హైదరాబాద్: కేరళ రాష్ట్రం కొట్టాయం జిల్లాలో ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు కురుస్తున్నాయి. కోడిమత, తళత్తంగడి, ఇల్లిక్కల్ వంటి అనేక ప్రాంతాలు తీవ్రంగా జలమయమయ్యాయి. అనేక దుకాణాలు, ఇండ్లు నీట మునిగాయి. ఆయా ప్రాంతాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా పాఠశాలలు, కళాశాలలు మూసివేశారు. పతనంతిట్ట జిల్లాలో పంబా నది ఉప్పొంగి ప్రవహిస్తోంది. మూజియార్ డ్యామ్ పరివాహక ప్రాంతానికి ‘రెడ్ అలర్ట్’ జారీ చేయబడింది. పరిస్థితి మరింత విషమిస్తే ఎప్పుడైనా డ్యామ్ గేట్లు తెరవాల్సి రావచ్చని అధికారులు హెచ్చరించారు. ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -