- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : తెలంగాణలో వర్షాలు దంచికొడుతున్నాయి. మంగళవారం రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు పడనున్నాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ మేరకు ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిజామాబాద్, జగిత్యాల, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో వానలు కురుస్తాయని వెల్లడించింది. ఈ జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
- Advertisement -



