Wednesday, July 22, 2026
E-PAPER
Homeసినిమావైవిధ్యమైన కథతో 'హాయ్`

వైవిధ్యమైన కథతో ‘హాయ్`

- Advertisement -


నయనతార, యువ హీరో కవిన్ తొలిసారి జంటగా నటిస్తున్న సినిమా ‘హాయ్’. ఈ సినిమా విడుదల తేదీని మేకర్స్ అఫీషియల్‌గా ప్రకటించారు.
ప్రత్యేక అనౌన్స్‌మెంట్ వీడియోను విడుదల చేస్తూ ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ను ఆగస్టు 14న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల చేయనున్నట్లు వెల్లడించారు. నూతన దర్శకుడు విష్ణు ఎడ్విన్ దర్శకత్వం వహిస్తున్నఈ చిత్రంలో కె. భాగ్యరాజ్, ప్రభు, రాధిక శరత్‌కుమార్, వీటీవీ గణేష్, సత్యన్, ఆదిత్య కదిర్, ఖురేషి తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి రాజేష్ శుక్లా సినిమాటోగ్రఫీ అందిస్తుండగా, జెన్ మార్టిన్ సంగీతం సమకూరుస్తున్నారు.
ఫిలోమిన్ రాజ్ ఎడిటర్‌గా, ఎస్. కన్నన్ ప్రొడక్షన్ డిజై నర్‌గా పనిచేస్తున్నారు. జీ స్టూడియోస్, ది రౌడీ పిక్చర్స్, సెవెన్ స్క్రీన్ స్టూడియో సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -