Thursday, August 27, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్మల్బరీ సాగుపై రైతుకు అధిక లాభాలు

మల్బరీ సాగుపై రైతుకు అధిక లాభాలు

- Advertisement -

– జిల్లా ఉద్యాన మరియు పట్టుపరిశ్రమ శాఖ అధికారి జీనుగు మరియాన్న,
మైసూర్ శాస్త్రవేత్త జె శ్రీకాంత్ నాయక్ 
నవతెలంగాణ-నెల్లికుదురు : రైతులు మల్బరీ సాగు చేసుకుంటే అధిక ఆదాయాన్ని పొందవచ్చు రైతు ఆర్థికంగా లాభం పొందే అవకాశాలు ఉన్నాయని జిల్లా ఉజ్వల మరియు పట్టు పరిశ్రమ శాఖ అధికారి జినుగు మరియాన్న మైసూర్ శాస్త్రవేత్త జె శ్రీకాంత్ నాయక్ తెలిపారు. మండల కేంద్రంలో గురువారం మేర రిశాం, మేరా అభిమాని 2.0 నా పట్టు అభిమానం2.0 అనే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నూతన రైతులకు మల్బరీ సాగు లాభదాయకం అని అన్నారు.

పంట మార్పిడితో ప్రతీ గ్రామంలో 50 ఎకరాలలో అధిక ఆదాయాన్నిచ్చే మల్బరీ  సాగు చేయాలి అని రైతులకు సూచించారు.కేంద్ర సిల్క్ బోర్డు 75 సంవత్సరాలు పూర్తి చేసిన సందర్భంలో మల్బరీ సాగు విస్తీర్ణంను పెంచే క్రమంలో నా పట్టు – నా అభిమానం 2.0 అనే కార్యక్రమాన్ని  మైసూర్ శాస్త్రవేత్త జె. శ్రీ కాంత్ నాయక్  , నెల్లికుదురు గ్రామం లో రైతులకు మల్బరి సాగు పై అవగాహన, తోటలో  నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రస్తుతం మల్బరీ సాగు చేస్తున్న రైతులను  నెల్లికుదురు పిలిపించి వారికి కేంద్ర సిల్క్ బోర్డు కర్ణాటక రాష్ట్రానికి చెందిన మైసూర్ శాస్త్రవేత్తలు జె. శ్రీకాంత్ నాయక్,  ప్రస్తుత మల్బరీ సాగులో రైతులు  ఎదుర్కొంటున్న వేరుకుళ్ళు తెగులు వంటి సమస్యలు తెలుసుకొని వాటిని సాఫ్ మరియు రూట్ ఫిక్స్ మరియు ఎమ్మార్. పి ఆర్ ఓ  వంటి వాటిని సదరు శాస్త్రవేత్త నివృత్తి చేశారు.   రైతాంగం పంట మార్పిడి ద్వారా మార్కెట్ డిమాండ్ ఉన్న మల్బరీ సాగు చేపట్టి ఎకరానికి 2 లక్షల ఆదాయం పొందారని అవగాహన కల్పించారు . ఈ పంట ఆదాయం సాఫ్ట్వేర్ ఇంజనీర్ జీతం తో సమానం అని తెలిపారు. క్లస్టర్ స్థాయిలో సామూహికంగా మల్బరీ సాగు చేపట్టాలని దీనికి కోతులు,  దొంగల బెడద లేదని, ఒక సంవత్సరం లో 5 నుండి 6 పంటలు తీసుకోవచ్చని ఎక్కువ స్థాయిలో ఎరువులు అవసరం లేదని, పురుగు మందులు అసలు అవసరం లేదని తెలుపుతుతూ ఈ సాగు వైపు మొగ్గుచూపాలని తెలిపారు.కేంద్ర పట్టు బోర్డు ఆధ్వర్యయంలో నిర్వహస్తున్న తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా రైతులు మరియు జిల్లా పట్టు పరిశ్రమ అధికారులు కె. సురేష్, డి. రాజయ్య  జూనియర్ కాలేజీ అధ్యాపకులు ముక్కెర ప్రకాష్ బాబు,లడె మహేందర్  పాల్గొన్నారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -