హీరో వరుణ్ తేజ్, దర్శకుడు మేర్లపాక గాంధీ కాంబోలో తెరకెక్కుతున్న హర్రర్ కామెడీ ఎంటర్టైనర్ ‘కొరియన్ కనకరాజు’. యూవీ క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం పోస్ట్-ప్రొడక్షన్ చివరి దశలో ఉంది. తాజాగా మేకర్స్ సెకండ్ సింగిల్ అప్డేట్ ఇచ్చారు. ‘రాసగుమ్మడి’ ఫుల్ లిరికల్ సాంగ్‌ను ఈనెల 19న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. వరుణ్ తేజ్, హీరోయిన్ దక్షా నాగర్కర్ కలర్ ఫుల్ లుక్‌తో విడుదలైన సాంగ్ అనౌన్స్మెంట్ పోస్టర్ మాస్-ఫెస్టివ్ సాంగ్ వైబ్ ని క్రియేట్ చేస్తోంది. ఇందులో దక్షా నాగర్కర్ స్పెషల్ సాంగ్ చేసింది. వరుణ్ తేజ్, దక్షా నాగర్కర్‌పై చిత్రీకరించిన ఈ సాంగ్ రాయలసీమ జాతర నేపథ్యంలో తెరకెక్కిన మాస్ డ్యాన్స్ నెంబర్‌గా ఉండబోతోంది. పోస్టర్‌లో ఇద్దరి ఎనర్జిటిక్ లుక్స్, ఫెస్టివ్ వైబ్స్ పాటపై అంచనాలను మరింత పెంచుతున్నాయి. థమన్ సంగీతం అందించిన ఈ పాట మరో చార్ట్‌బస్టర్‌గా కానుంది. ఈ చిత్రంలో రితికా నాయక్ కథానాయికగా నటిస్తుండగా, కమెడియన్ సత్య కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రంలో అగ్రశ్రేణి సాంకేతిక నిపుణులు పని చేస్తున్నారు. ఎస్. థమన్ సంగీతం అందించగా, మనోజ్ రెడ్డి కటసాని డీవోపీగా పని చేస్తున్నారు.
రాయలసీమ జాతర నేపథ్యంలో..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



