Tuesday, August 25, 2026
E-PAPER
Homeతాజా వార్తలునిద్రలోనే ఇంటర్‌ విద్యార్థిని మృతి!

నిద్రలోనే ఇంటర్‌ విద్యార్థిని మృతి!

- Advertisement -

నవతెలంగాణ-హైదరాబాద్ : నిద్రలోనే ఓ ఇంటర్‌ విద్యార్థిని మృతి చెందిన ఘటన జనగామ జిల్లా చిల్పూరు మండలంలో చోటు చేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. వంగాలపల్లికి చెందిన పల్లవి(16) కాటారం(భూపాలపల్లి) ట్రైబల్‌ వెల్ఫేర్‌ కళాశాలలో ఇంటర్‌ ఫస్టియర్ చదువుతోంది. రాఖీ పండగ సెలవులతో పాటు ఓ విందు కార్యక్రమంలో పాల్గొనేందుకు ఇంటికి వచ్చిన పల్లవి ఆదివారం రాత్రి కుటుంబ సభ్యులతో గడిపింది. సోమవారం ఉదయం నిద్రలేవకపోవడంతో ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -