ఇండియా–జపాన్ వర్క్‌ఫోర్స్
రౌండ్‌టేబుల్‌లో మంత్రి వివేక్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు జపాన్ కంపెనీలు ముందుకు రావాలని శక్తి , గనుల శాఖ మంత్రి డాక్టర్ జి వివేక్ వెంకటస్వామి ఆహ్వానించారు. జపాన్ సంస్థలు తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు వస్తే అవసరమైన సహకారం, మార్గదర్శకత్వాన్ని ప్రభుత్వం అందిస్తుందని తెలిపారు. తెలంగాణలో జపాన్ కంపెనీల పెట్టుబడులు సురక్షితంగా, లాభదాయకంగా ఉండేలా అన్ని విధాలా సహకరిస్తామని తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణ పెట్టుబడులకు అనుకూలమైన రాష్ట్రంగా వేగంగా అభివృద్ధి చెందుతోందన్నారు. ఒసాకాలో కెరీర్ కన్సల్ట్ వ్యవస్థాపకుడు,సీఈఓ రోహిత్ రావు నిర్వహించిన ‘లెవరేజింగ్ ఇండియన్ టాలెంట్’ ఇండియా–జపాన్ వర్క్‌ఫోర్స్ రౌండ్‌టేబుల్‌లో మంత్రి పాల్గొన్నారు. జపాన్ వ్యాపారవేత్తలు, పరిశ్రమల ప్రతినిధులు, ప్రభుత్వ, విద్యా సంస్థల ప్రతినిధులతో తెలంగాణలో పెట్టుబడులు, నైపుణ్య మానవ వనరులు, ఉపాధి అవకాశాలు, టాలెంట్ మొబిలిటీపై విస్తృతంగా చర్చించారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. తెలంగాణలో పెట్టుబడులకు విస్తృతమైన అవకాశాలతో పాటు నైపుణ్యవంతులైన మానవ వనరులు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ఐటీ, ఇంజినీరింగ్, ఫార్మాస్యూటికల్స్, బయోటెక్నాలజీ తదితర రంగాల్లో రాష్ట్రానికి బలమైన టాలెంట్ పూల్ ఉందన్నారు. జపాన్ కంపెనీలు తెలంగాణలో తమ కార్యకలాపాలను విస్తరించడంతో పాటు కొత్త పరిశ్రమలు, ప్రాజెక్టులు ఏర్పాటు చేయాలని కోరారు.పెట్టుబడులకు అవసరమైన అనుమతులు, మౌలిక వసతులు, ప్రభుత్వ సహకారం అందిస్తూ వ్యాపారాలకు అనుకూలమైన వాతావరణాన్ని కల్పిస్తున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో కార్మిక శాఖ కార్యదర్శి హరిచందన పాల్గొన్నారు.
తెలంగాణలో పెట్టుబడులు పెట్టండి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



