- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : అమెరికాతో పూర్తి స్థాయి యుద్ధం కొనసాగుతున్నట్లు ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ ప్రకటించిన కొద్దిసేపటికే ఇరాన్ దాడులను మరింత ఉద్ధృతం చేసింది. కువైట్‌లోని అమెరికా సైనిక స్థావరాలపై క్షిపణి దాడులు జరిపినట్లు ఇరాన్ ప్రభుత్వ మీడియా IRNA వెల్లడించింది. ముఖ్యంగా ఆరిఫ్జాన్ బేస్‌లో ఉన్న అమెరికా హిమార్స్
మిస్సైల్ వ్యవస్థలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేసినట్లు పేర్కొంది. ఈ స్థావరం అమెరికా ఎయిర్ ఫోర్స్, నేవీ, మెరైన్ కార్ప్స్, కోస్ట్ గార్డ్‌కు కీలక కేంద్రంగా ఉండటంతో పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరింత పెరిగాయి.
- Advertisement -



