Wednesday, July 15, 2026
E-PAPER
Homeతాజా వార్తలు‘జ‌న నాయ‌గ‌న్‌’ రిలీజ్ డేట్ ఫిక్స్

‘జ‌న నాయ‌గ‌న్‌’ రిలీజ్ డేట్ ఫిక్స్

- Advertisement -


విజ‌య్ హీరోగా న‌టించిన చివరి చిత్రం ‘జ‌న నాయ‌గ‌న్‌’. ఈ సినిమాను ప్ర‌పంచ వ్యాప్తంగా ఈనెల 23న రిలీజ్ చేయ‌బోతున్న‌ట్లు మేక‌ర్స్ ప్ర‌క‌టించారు. సినీ ప్రేమికులంద‌రూ అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రాల్లో ‘జన నాయగ‌న్‌’ ఒక‌టి. విజ‌య్ అద్బుత‌మైన సినీ ప్ర‌యాణంలో ఇదొక కీల‌క‌మైన మైలు రాయిగా నిల‌వ‌నుంది. ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఆయన చివరి సినిమా కోసం ఆసక్తిగా ఎదురు చూస్తుండగా, భారతీయ సినీ పరిశ్రమపై చెరగని ముద్ర వేసిన ఆయన కెరీర్‌కు ఈ చిత్రం సరైన నివాళిగా నిలుస్తుందని అంద‌రూ భావించటం విశేషమని, హెచ్‌.వినోద్ దర్శకత్వంలో కెవిఎన్ ప్రొడ‌క్ష‌న్స్ నిర్మాణంలో రూపొందిన‌ ఈ చిత్రం ప్రేక్షకులకు అద్భుతమైన సినిమాటిక్ అనుభవాన్ని అందివ్వనుంది అని చిత్ర బృందం తెలిపింది. నిర్మాత వెంక‌ట్ కె.నారాయ‌ణ మాట్లాడుతూ,“సినిమా చరిత్రలో నిజంగా చారిత్రాత్మకంగా అనిపించే క్షణాలు చాలా అరుదు. ‘జన నాయగన్’ కూడా అలాంటి ప్రత్యేకమైన క్షణం. విజయ్ తన చివరి సినిమాతో సిల్వర్ స్క్రీన్పై సందడి చేయనున్నారు. ఈ ప్రయాణంలో భాగమైనందుకు గౌరవంగా భావిస్తున్నాం` అని అన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -