Magazines

ఓటర్లకు మరో అవకాశం!

37 నిమిషాల క్రితం

voters
avatar
balaji

ప్రచురించబడింది నవం 06, 2026 | 2 నిమిషాల చదవడం

తెలంగాణ సహా 7 రాష్ట్రాల్లో గల్లంతైన పేర్లకు మళ్లీ చోటు..ఎన్నికల సంఘం ప్రకటన
అర్హులెవరూ ఓటు హక్కు కోల్పోకుండా పర్యవేక్షణ యంత్రాంగం


న్యూఢిల్లీ : ఏడు రాష్ట్రాల్లో జరుగుతున్న ప్రత్యేక సమగ్ర సమీక్ష(సర్) ప్రక్రియలో భాగంగా ముసాయిదా ఓటర్ల జాబితాలో పేర్లు గల్లంతైన ఓటర్లకు తుది ఓటర్ల జాబితా లో తమ పేర్లను నమోదు చేసుకొనేందుకు మరో అవకాశం కల్పిస్తున్నట్టు భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) శుక్రవారం ప్రక టించింది. గణన పత్రాలు జారీ చేసినప్పటికీ గైర్హాజరు, స్థానచలనం, మరణం లేదా నకిలీ (ఏఎస్ఓడీ)గా వర్గీకరించిన తర్వాత ముసా యిదా జాబితాల నుంచి తొలగింపునకు గురైన ఓటర్లకు ఈ ఆదేశం వర్తిస్తుంది. ఢిల్లీ, మహారాష్ట్ర, హర్యానా, ఆంధ్రప్రదేశ్, జార్ఖండ్, తెలంగాణ, నాగాలాండ్ రాష్ట్రాలు ఈ ఆదేశం పరిధిలోకి వస్తాయి. తుది ఓటర్ల జాబితాలో చేరే అవకాశాన్ని ఏ అర్హత గల ఓటరుకు కూడా నిరాకరించకుండా చూసేం దుకు, అదే సమయంలో నకిలీ నమోదులను నివారించేందుకు ఒక పర్యవేక్షణ యంత్రాం గాన్ని ఏర్పాటు చేయాలని అధికారులను ఈసీ ఆదేశించింది.

"ఏఎస్ఓడీగా గుర్తించ బడి, ఫలితంగా ముసాయిదా ఓటర్ల జాబితా లో పేరులేని ఓటరు రాష్ట్రంలోనే తన నివాస స్థలాన్ని మార్చుకున్న సందర్భాలలో అటువంటి ఓటరు ఫామ్ -8 సమర్పించాల్సిన అవసరం లేదు. దానికి బదులుగా వారు ఇక్కడ అనుబంధంం- సీ (అనెక్టర్-సీ) జతచేసిన డిక్లరేషన్తో(కొత్త చిరునామా, అసెంబ్లీ నియోజకవర్గాన్ని సూచిస్తూ) పాటు గణన పత్రాన్ని సమర్పించాలి" అని ఈసీ ఒక ప్రకటనలో తెలిపింది. సర్ ప్రక్రియలో భాగంగా కొత్త నమోదు కోసం ఇప్పటికే ఫామ్ -6 సమర్పించిన ఓటర్లు గణన ఫామ్, దానితో పాటు డిక్లరేషన్ ను మళ్లీ సమర్పించాల్సిన అవసరం లేదని ఈసీ స్పష్టం చేసింది. నవంబర్ 3న కమిషన్ జారీ చేసిన వివరణకు అనుగుణంగా వారి దరఖాస్తుల పరిశీలన జరుగుతుందని తెలిపింది. సంబంధిత ఓటర్లను సంప్రదించేందుకు వివిధ రాజకీయ పార్టీలకు చెందిన బూత్ స్థాయి ఏజెంట్లతో సమన్వయం చేసుకోవాలని బూత్ స్థాయి అధికారులను(బీఎల్) ఈసీ ఆదేశించింది. ఇందులో ఇంటింటికీ వెళ్లడం, పొరుగువారు, కుటుంబ సభ్యులు, కాలనీ సంక్షేమ సంఘాల వద్ద విచారించడం, అలాగే వీలైన చోట అందుబాటులో ఉన్న ఫోన్ నంబర్ల ద్వారా ఓటర్లను సంప్రదించడం వంటివి ఉంటాయి.



ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్