పోలీసుల అదుపులో ఆర్మీఅధికారి భార్య
న్యూఢిల్లీ: విదేశీ గూఢచర్య సంస్థలకు దేశ రక్షణకు సంబంధించిన సున్నితమైన సమాచారం చేరవేస్తున్నారనే ఆరోపణలతో.. ఆర్మీ అధికారి భార్యను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దేశ భద్రతపై ప్రత్యక్ష ప్రభావం చూపే సున్నితమైన పత్రాలు, ఫోటోలు, ఎలక్ట్రానిక్ డేటాను రహస్యంగా సేకరించడం, బదిలీ చేయడం వంటి విషయాల్లో విదేశీ ఏజెంట్లకు సహకరిస్తున్నట్టు నిఘా వర్గాల సమాచారం అందినట్లు తెలిపారు. వారు వెల్లడించిన వివరాల ప్రకారం..
పరిశోధన సంబంధిత కార్యకలాపాలను ఆర్మీ అధికారి పర్యవేక్షించేవారు. ఆయన భార్యకు కొన్ని నెలల క్రితం.. సోషల్ మీడియాలో పలువురు వ్యక్తులు పరిచయం అయ్యారు. వారు తమను తాము విద్యావేత్తలుగా చెప్పుకొన్నారు. వ్యాసాలను ప్రచురిస్తామని నమ్మించి రక్షణ అంశాలపై వ్యాసాలు రాయించారు. ఎటువంటి అనుమానం రాకుండా ఉండేందుకు మొదట పర్యావరణం, భౌగోళిక రాజకీయాలకు సంబంధించిన అంశాలపై వ్యాసాలు రాయిస్తూ.. క్రమంగా రక్షణ రంగానికి సంబంధించిన విషయాల వైపు మళ్లించారు. ఈ విషయం తెలియని మహిళ వారిని నిజమైన విద్యావేత్తలుగా నమ్మి.. వారి ఉచ్చులో పడిపోయింది. రక్షణ, ఆయుధ వ్యవస్థలపై వ్యాసాలతో పాటు కీలక సైనిక స్థావరాల ఫొటోలు, వీడియోలు వాటిలో పొందుపరిచింది. రక్షణ రంగానికి సంబంధించిన వివరాలను కూడా ఆమె వారికి చేరవేసిందా ?అనే కోణంలో దర్యాప్తు చేపట్టారు.
విదేశీ సంస్థలకు రహస్య సమాచారం
1 గంట క్రితం

balaji
ప్రచురించబడింది అక్టో 19, 2026 | 1 నిమిషాల చదవడం





కామెంట్లు (0)