- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : జార్ఖండ్‌లో విద్యార్థుల ఆందోళనల నేపథ్యంలో ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ కీలక ప్రకటన చేశారు. విద్యార్థుల డిమాండ్లకు అంగీకరిస్తూ, జీఎస్ఎస్ సీ- సీజీఎల్ పరీక్షలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. టీడీపీఎల్ నిర్వహించిన అన్ని పరీక్షలను కూడా రద్దు చేస్తున్నట్లు తెలిపారు. 2014 నుంచి జరిగిన పరీక్షల అక్రమాలపై సమగ్ర దర్యాప్తునకు ఆదేశాలు జారీ చేశారు. సీఎం సోరెన్ ప్రకటనతో రాంచీలో విద్యార్థులు సంబరాలు చేసుకుంటున్నారు.
- Advertisement -



