నవతెలంగాణ-ఆలేరు టౌను
కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ నిధులు ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని, బీఆర్ఎస్ పట్టణ, మండల అధ్యక్షులు పుట్ట మల్లేశం, గంగుల శ్రీనివాస్ కోరారు. ఆలేరు పట్టణ కేంద్రంలో సోమవారం కళ్యాణ లక్ష్మి మరియు షాదీ ముబారక్ పథకాలను ప్రభుత్వం నిలిపివేయడాన్ని ఖండిస్తూ మాట్లాడారు. కెసిఆర్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలు పేద ఆడపిల్లలకు వరంగా ఉండేవని, ఆడపిల్ల పెళ్లి పేద కుటుంబాలకు భారం కాకూడదనే ఉద్దేశంతో కెసిఆర్ ఒక లక్ష 16రూపాయల ఆర్థిక సహాయం అందించారని గుర్తు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ పథకాలను పూర్తిగా నిలిపివేసిందని ఆరోపించారు.
పేద కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కల్యాణ లక్ష్మి షాదీ ముబారక్ కొరకు, పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతాం అని హెచ్చరించారు. అనంతరం తహసీల్దార్ కి వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో కుండే సంపత్, ఆడెపు బాలస్వామి, కొలుపుల హరినాథ్, జెల్లి నరసింహులు, ఎసిరెడ్డి మహేందర్ రెడ్డి,జింకల రామకృష్ణ, పూల శ్రవణ్, కోటగిరి పండరి,దొంతుల ఎల్లేష్, పాసికంటి శ్రీనివాస్, పత్తి వెంకటేష్, కందుల శ్రీకాంత్, బీజన మధు, కూతాటి అంజన్ ఎండి జమాల్, ఎలుగల హరికృష్ణ హరిక చంద్రశేఖర్ కటకం మల్లేష్ మొగిలి పాక కృష్ణ అలిసిర్ నవీన్. సతీష్,ఎండి పాయెజ్, మాజీ ప్రజాప్రతినిధులు, పట్టణ, మండల నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.



