Monday, July 13, 2026
E-PAPER
Homeతాజా వార్తలుభోగాపురం ఎయిర్‌పోర్టుకు కీలక గుర్తింపు

భోగాపురం ఎయిర్‌పోర్టుకు కీలక గుర్తింపు

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : భోగాపురం విమానాశ్రయానికి కేంద్ర హోంశాఖ కీలక గుర్తింపునిచ్చింది. ఇమిగ్రేషన్, విదేశీయుల చట్టం పరిధిలోకి ఈ ఎయిర్‌పోర్టును తీసుకువస్తున్నట్లు తెలిపింది. ఈమేరకు గెజిట్ నోటిఫికేషన్‌ను కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. దీని ప్రకారం కేటగిరీ-1 విమానాశ్రయాల జాబితాలో 39వ స్థానంలో భోగాపురం చేరింది. ఇక్కడి నుంచి నేరుగా విమానాల రాకపోకలకు మార్గం సుగమమైంది. కేంద్ర హోం శాఖ అదనపు కార్యదర్శి నితేష్ కుమార్ వ్యాస్ పేరిట ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈ నోటిఫికేషన్‌తో ఇమిగ్రేషన్ చెక్‌పోస్ట్‌గా భోగాపురానికి గుర్తింపు లభించింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -