Sunday, July 26, 2026
E-PAPER
Homeకవితనెత్తుటి దీపాలు

నెత్తుటి దీపాలు

- Advertisement -

ఒక చంటిపాప ఎదురుచూపు
వొస్తూ వొస్తూ నాన్న
ఒక ఆట బొమ్మ తెస్తాడు అని
ఒక ఇల్లాలు
గుమ్మానికి చెక్కిన శిల్పం
పూట గడిచే మూట పట్టుకొస్తాడు అని
బిడ్డలు క్షేమంగా ఉండాలని
ప్రతి తల్లీ కోరుకున్నట్టే
ఎటునుండి ఏ దుర్వార్త గుండెల్లో పేలుతుందోనని
భయం గుప్పిట్లో బంధీలయిన
ఆ తల్లులు
పూజ గదిలో దేవుని పాదాలు
వొదలని వీర భక్తులు వాళ్ళు
పోయేటప్పుడు పున్నమి చంద్రులు
వచ్చేటప్పుడు గ్రహణ సూర్యులు
కాలికో వేలికో గాయమవ్వకుండా
డ్యూటీ దిగరు
అక్కడ నెత్తురు శాక పోయకుండా
వాళ్ళకు రోజు గడువదు
వాళ్ళు, తెలిసి తెలిసి
పద్మవ్యూహంలోకి పరుగెడుతున్న అభిమన్యులు
చీకటిని చీలుస్తూ వెలిగే అగ్గి రవ్వలు
అంధకారపు గోడలు పగులగొడుతూ
వేల కాంతులు వెదజల్లే విద్యుత్‌ దీపాలు
కాల రేఖల మీద కాంతి ఖనిజాలు వెతుకుతున్న
మండే గుండెల పదును గునపాలు
వంకర టింకర తలరాతలు సరిచేసుకునే
శ్రమ శక్తి గీతాలు
గనులు తొవ్వి
కలలు చేదుకునే నెత్తుటి దీపాలు.

– గజ్జెల రామకృష్ణ, 8977412795

- Advertisement -
Previous article
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -