Thursday, August 20, 2026
E-PAPER
Homeజాతీయంబార్ కౌన్సిల్ ఎదుట లా విద్యార్థుల ధర్నా

బార్ కౌన్సిల్ ఎదుట లా విద్యార్థుల ధర్నా

- Advertisement -

నవతెలంగాణ-హైదరాబాద్: నల్సార్ లా విద్యార్థులు ఢిల్లీలోని బార్ కౌన్సిల్ ఆఫీస్ ఎదుట ఆందోళన చేపట్టారు. బీసీఐ చైర్మన్ మానన్ కుమార్ మిశ్రా రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. విద్యార్థుల ఆందోళన నేపథ్యంలో భారీగా పోలీస్ బలగాలు మోహరించాయి. ఆల్ ఇండియా యంగ్ అడ్వకేట్స్ అసోసియేషన్ పిలుపు మేరకు, కాక్రోచ్ జనతా పార్టీ మద్దతుతో ఈ కార్యక్రమం జరిగింది. నిరసనకారులు మిశ్రా రాజీనామా చేయాలని, జవాబుదారీతనం కోరుతూ నినాదాలు చేస్తూ, ప్లకార్డులు ప్రదర్శించారు.

ఇటీవలి నల్సార్ యూనివర్సీటీ స్నాతకోత్సవానికి సీజేఐ సూర్యకాంత్‌ను ఆహ్వానించడంపై విద్యార్థులు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆయన రాకను వ్యతిరేకిస్తూ వర్సీటీ అధికారులకు లేఖలు రాశారు. ఈ నేపథ్యంలో, హైదరాబాద్‌లోని నల్సార్ విశ్వవిద్యాలయం- 2026 గ్రాడ్యుయేటింగ్ బ్యాచ్‌ను నమోదు చేసుకోవద్దని ఆగస్టు 13న బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (బీసీఐ) రాష్ట్ర బార్ కౌన్సిళ్లను ఆదేశించడంతో ఈ వివాదం మొదలైంది. తీవ్ర విమర్శలు రావడంతో ఈ నిర్ణయాన్ని బార్ కౌన్సిల్ ఉపసంహరించుకుంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -