Wednesday, August 19, 2026
E-PAPER
Homeమానవిఇలా చేద్దాం..

ఇలా చేద్దాం..

- Advertisement -

బెండకాయ వేపుడన్నా, పులుసన్నా చిన్నా పెద్దా అందరూ ఎంతో ఇష్టంగా తింటారు. అయితే, రుచిలో అగ్రస్థానంలో ఉండే ఈ కూరగాయను వండటం వెనుక ఒక పెద్ద ‘జిగురు’ కష్టం దాగి ఉంటుంది. బెండకాయను కోయడం మొదలుపెట్టగానే ఆ జిగురు కత్తికి, చేతులకు అంటుకుని విసుగు తెప్పిస్తుంటుంది. చాలామంది ఈ జిగురు వల్లే బెండకాయ వండటానికి బద్ధకిస్తుంటారు. వీటిని కోసేటప్పుడు జిగురు చేతులకు అంటుకోకుండా ఉండాలంటే ఏం చేయాలో చూద్దాం.

తడి లేకుండా జాగ్రత్త పడాలి
బెండకాయ జిగురుకు ప్రధాన శత్రువు నీరు. అందుకే బెండకాయలను వండటానికి కనీసం గంట ముందే కడిగి ఆరబెట్టాలి. ఒకవేళ త్వరగా కోయాల్సి వస్తే, శుభ్రమైన కాటన్ గుడ్డతో ప్రతి కాయను తుడిచి, తడి పూర్తిగా పోయాకే కోయాలి. తడి ఉన్నప్పుడు కోస్తే జిగురు రెట్టింపు అవుతుంది.

కత్తికి నిమ్మరసం : ఇది చాలా పురాతనమైన , ప్రభావవం తమైన చిట్కా. బెండకాయలు కోయడానికి ముందు కత్తికి రెండు వైపులా కొద్దిగా నిమ్మరసం రాయండి. నిమ్మలోని ఆమ్ల గుణం బెండకాయ లోని జిగురును కత్తికి అంటుకోకుండా చేస్తుంది. నిమ్మరసం లేకపోతే కొద్దిగా వంట నూనెను కూడా వాడవచ్చు.

వంటలో పులుపు పదార్థాలు: బెండకాయ కూర లేదా వేపుడు వండుతున్న ప్పుడు మధ్యలో ఒక చెంచా పెరుగు, కొద్దిగా చింతపండు రసం లేదా నిమ్మరసం చేర్చండి. ఇవి జిగురును విచ్ఛిన్నం చేసి ముక్కలు విడివిడిగా వచ్చేలా చేస్తాయి. ఇది కూర రుచిని పెంచడమే కాకుండా జిగురును పోగొడుతుంది.

మూత పెట్టకుండా వండటం: చాలామంది కూర త్వరగా ఉడకాలని మూత పెడతారు. కానీ బెండకాయ విషయంలో ఇది తప్పు. మూత పెట్టడం వల్ల లోపల ఆవిరి తయారై ముక్కలు మెత్తబడి జిగురుగా మారతాయి. అందుకే ఎక్కువ సేపు మూత పెట్టకుండా, మధ్యస్థ మంటపై వేయించడం వల్ల జిగురు పోతుంది.

ఉప్పు చివరలో వేయండి: బెండకాయ వండేటప్పుడు ఉప్పును మొదటిలోనే వేయకూడదు. ఉప్పు వేయగానే బెండకాయల నుండి నీరు విడుదలయ్యి జిగురు పెరుగుతుంది. కూర దాదాపు 80 శాతం ఉడికిన తర్వాత మాత్రమే ఉప్పు కలిపితే ముక్కలు కరకరలాడుతూ వస్తాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -