వర్షాకాలం వచ్చిందంటే ఎండ వేడి తగ్గి వాతావరణం చల్లగా మారుతుంది. కానీ ఈ కాలంలో చర్మ సమస్యలు మాత్రం ఎక్కువయ్యే అవకాశం ఉంటుంది. గాలిలో తేమ అధికంగా ఉండటం వల్ల చర్మం జిడ్డుగా మారడం, ముఖంపై దుమ్ము, మురికి పేరుకుపోవడం, రంధ్రాలు (పోర్స్) మూసుకుపోవడం, మొటిమలు, బ్లాక్‌హెడ్స్, వైట్‌హెడ్స్ వంటి సమస్యలు ఎక్కువగా కనిపిస్తాయి. అలాంటి సమయంలో ఫేషియల్ స్టీమింగ్ మంచి స్కిన్‌కేర్ పద్ధతిగా నిపుణులు సూచిస్తున్నారు.
ముఖానికి ఆవిరి పట్టడం వల్ల చర్మ రంధ్రాలు సహజంగా తెరుచుకుంటాయి. వాటిలో పేరుకుపోయిన దుమ్ము, నూనె, మలినాలు బయటకు రావడానికి ఇది సహాయపడుతుంది. దీంతో ముఖం మరింత శుభ్రంగా, తాజాగా కనిపిస్తుంది. వారం రోజుల్లో ఒకటి లేదా రెండు సార్లు మాత్రమే స్టీమింగ్ చేస్తే చర్మం ఆరోగ్యంగా ఉండటానికి ఉపయోగపడుతుంది.
ఫేషియల్ స్టీమింగ్ రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. వేడి ఆవిరి వల్ల ముఖంలోని రక్తనాళాలు విస్తరించి రక్తప్రసరణ మెరుగుపడుతుంది. దీంతో చర్మ కణాలకు ఆక్సిజన్, పోషకాలు బాగా అందుతాయి. ఫలితంగా చర్మం సహజమైన కాంతిని పొందుతుంది. ముఖం తాజాగా, ఆరోగ్యంగా కనిపిస్తుంది.
వర్షాకాలంలో ఆయిలీ స్కిన్ ఉన్నవారికి జిడ్డు ఎక్కువగా ఉంటుంది. స్టీమింగ్ వల్ల అదనపు సీబమ్ తగ్గి చర్మం పరిశుభ్రంగా ఉంటుంది. అయితే స్టీమింగ్ చేసిన వెంటనే గట్టిగా రుద్దకుండా, తేలికపాటి క్లెన్సర్‌తో ముఖాన్ని శుభ్రం చేసుకుని మంచి మాయిశ్చరైజర్ తప్పనిసరిగా రాయాలి. ముక్కు, చెంపల వద్ద ఉండే గట్టి బ్లాక్‌హెడ్స్‌ను చేతులతో లేదా గోళ్లతో నొక్కి తీసేయకూడదు. అలా చేస్తే ఇన్ఫెక్షన్, మచ్చలు వచ్చే ప్రమాదం ఉంటుంది. స్టీమింగ్ చేసిన తర్వాత అవి సహజంగానే మెత్తబడతాయి. అప్పుడు సరైన స్కిన్‌కేర్ విధానంతో వాటిని తొలగించవచ్చు.
ఇలా చేద్దాం…
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



