నిర్మాతగా, డిస్ట్రిబ్యూటర్‌గా, జర్నలిస్ట్‌గా తనకంటూ ప్రత్యేకమైన ముద్ర వేసుకున్న సురేష్ కొండేటి ఇప్పుడు ‘ప్రేమనే ఊరిలో’ సినిమాతో రాబోతున్నారు.
మనోజ్ కుమార్ దర్శకత్వంలో మహారత్న ప్రొడక్షన్స్, ఎస్.కే పిక్చర్స్, వనిల్లా ఎంటర్‌టైన్ మెంట్స్ బ్యానర్లపై చందు శ్రీనివాస్, సురేష్ కొండేటి, మమత దేవేంద్ర ఎం సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో శ్రీ రామ్, రామికా శివు, తపస్విని పూణచ్చ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా, తెలంగాణ ప్రజలు ఎంతో వైభవంగా జరుపుకునే అమ్మవారి బోనాలు పండుగ రోజు ఫిలింనగర్ శ్రీ రాజరాజేశ్వరి దేవస్థానంలో ఫస్ట్ లుక్ ఆవిష్కరణ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది.
హనుమాన్ చౌదరి డైలాగ్స్, రాంబాబు గోశాల పాటలు, సునాద్ గౌతమ్ సంగీతం, రాజ్‌కాంత్ ఎస్.కే కెమెరా పనితనం ఈ చిత్రానికి ప్లస్ పాయింట్లు. సురేష్ కొండేటి సక్సెస్ ఫుల్ ట్రాక్ రికార్డ్‌ను కొనసాగిస్తూ ఈ సినిమా కూడా మరొక బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలుస్తుందని చిత్ర బృందం నమ్మకం వ్యక్తం చేసింది.
రంగాయణ రఘు, శ్రీరామ్, తపస్విని పూనాచా, రమిక శివు నటించిన ఈ చిత్రానికి క్రియేటివ్ ప్రొడ్యూసర్: దేవేంద్ర ఎం, నిర్మాతలు: చందు శ్రీనివాస్, సురేష్ కొండేటి, మమత దేవేంద్ర ఎం, కథ, స్క్రీన్ ప్లే, దర్శకుడు: మనోజ్ కుమార్.
భిన్న కథతో ‘ప్రేమనే ఊరిలో’
- Advertisement -
- Advertisement -



