నవతెలంగాణ - హైదరాబాద్ : బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ గాంధీ కుటుంబాన్ని ఉద్దేశించి సోషల్ మీడియాలో చేసిన పోస్టులపై హిమాచల్‌ప్రదేశ్‌లో ఆమెపై కేసు నమోదైంది. శిమ్లాకు చెందిన రిటైర్డ్ కెప్టెన్ అతుల్ శర్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. నవంబర్ 10న కంగనా చేసిన పోస్టుల్లో మాజీ ప్రధాని ఇందిరా గాంధీ, ఆమె కుమారులు సంజయ్ గాంధీ, రాజీవ్ గాంధీల మరణాలపై అనుచిత వ్యాఖ్యలు ఉన్నాయని ఫిర్యాదుదారు ఆరోపించారు. సోనియా గాంధీపై చేసిన వ్యాఖ్యలను కూడా ప్రస్తావించారు. ఈ పోస్టులు ప్రజల్లో విద్వేషాలు రెచ్చగొట్టేలా ఉన్నాయని ఫిర్యాదులో పేర్కొన్నారు. కాగా, ఈ కేసుపై కంగనా ఇప్పటివరకు స్పందించలేదు.
గాంధీ కుటుంబంపై పోస్టులు.. కంగనా రనౌత్‌పై కేసు నమోదు
1 గంట క్రితం

Kalluri Elender
ప్రచురించబడింది నవం 14, 2026 | 1 నిమిషాల చదవడం





కామెంట్‌లు (0)