Magazines

సీపీఐ(ఎం) అభ్యర్థులు విజయం సాధించిన స్థానాలు

52 నిమిషాల క్రితం

cpim
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 07, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ అమరావతి: ఆంధ్రప్రదేశ్ పరిషత్‌ ఎన్నికల కౌంటింగ్‌ కొనసాగుతోంది.మొత్తం 659జడ్పీటీసీ స్థానాల్లో 170కిపైగా స్థానాల్లో..మొత్తం 9,821ఎంపీటీసీ స్థానాల్లో రెండు వేలకుపైగా చోట్ల కూటమి హవా కొనసాగుతోంది.ఈ ఎదురుగాలిని సైతం తట్టుకొని కొన్ని జిల్లాలలో సీపీఐ(ఎం)ఎంపీటీసీ స్థానాల్లో విజయం సాధించింది.ఏలూరుజిల్లా బుట్టాయిగూడెం మండలం రెడ్డి గణపవరం 2ఎంపీటీసీ స్థానంలో సీపీఐ(ఎం)అభ్యర్థి కనకమ్మ 78ఓట్ల తేడాతో ఇండిపెండెంట్ అభ్యర్థిపై గెలుపొందారు.

కర్నూలు జిల్లా కోడుమూరు నియోజకవర్గ పరిధిలోని కోడుమూరు -5ఎంపిటిసిగా సీపీఐ(ఎం)అభ్యర్థి నాగిరెడ్డి విజయం సాధించారు.ఎటపాక మండలం విస్సాపురం ఎంపీటీసీస్థానంలో సీపీఐ(ఎం)అభ్యర్థి సోందే రామారావు 289ఓట్ల మెజారిటీతో ఘన విజయం సాధించారు.పోలవరం జిల్లా విఆర్ పురం మండలం రామవరం ఎంపీటీసీ సీపీఐ(ఎం)అభ్యర్థి కారం సుందరయ్య గెలుపొందారు.నెల్లూరు జిల్లా విడవలూరు మండలం అన్నారెడ్డి పాలెం ఎంపీటీసీ సీపీఐ(ఎం)అభ్యర్థి కోసూరి వెంకటరమణమ్మ 120ఓట్ల మెజార్టీతో విజేతగా నిలిచారు.


జడ్పీటీసీలలోనూ సీపీఐ(ఎం)

జడ్పీటీసీలలోనూ సీపీఐ(ఎం)అభ్యర్థులు గట్టి పోటీ ఇస్తున్నారు.అల్లూరి సీతారామరాజు జిల్లా ముంచింగి పుట్టు మండల జడ్పీటీసీగా సీపీఐ(ఎం)అభ్యర్థి కోర్రా త్రినాథ్,క్రోసూరు జడ్పీటీసీగా సీపీఐ(ఎం)అభ్యర్థి జి.రవిబాబు గెలుపు దిశగా ఉన్నారు.


సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్