నవతెలంగాణ హైదరాబాద్: పేద కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా 'ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని' ప్రవేశపెడుతోంది.ఈ పథకాన్ని ఈ నెల 19వ తేదీన సిద్దిపేటలో అధికారికంగా ప్రారంభించనున్నారు. ఈ పథకం కింద 18నుండి 59ఏళ్ల మధ్య వయసున్న కుటుంబ పెద్దకు రూ.5లక్షల వరకు జీవిత బీమా సౌకర్యం కల్పించనున్నారు.
ఈ బీమా పథకానికి అర్హులైన వారు తమ ఆధార్ కార్డు, రేషన్ కార్డు వివరాలతో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.గ్రామీణ, పట్టణ ప్రాంతాల వారీగా లబ్ధిదారుల వివరాలను నమోదు చేయడంతో పాటు దరఖాస్తులో నామినీ పేరును తప్పనిసరిగా పేర్కొనాలి. ఒకవేళ నామినీ మైనర్ అయితే సంరక్షకుడి (గార్డియన్)వివరాలను కూడా జత చేయాల్సి ఉంటుంది.ప్రజల నుండి స్వీకరించిన దరఖాస్తులను అధికారులు క్షుణ్ణంగా పరిశీలించిన అనంతరం అర్హుల వివరాలను ప్రభుత్వం ఆన్‌లైన్‌లో నమోదు చేయనుంది.






కామెంట్‌లు (0)