Magazines

చుండ్రు సమస్యకు...

6 రోజుల క్రితం

hair
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 10, 2026 | 1 నిమిషాల చదవడం

జుట్టుకి సంబంధించి ఆడామగా తేడాలేకుండా కామన్‌గా ఎదురయ్యే సమస్య చుండ్రు. ఒకసారి చుండ్రు తలకు పట్టిందంటే అది వదలడానికి చాలా టైం పడుతుంది. ఆలోపు జుట్టు ఊడిపోవడం, తల చర్మం దెబ్బతింటుంది. ఈ క్రమంలో డాండ్రఫ్‌ తగ్గడానికి ఖరీదైన షాంపూలు లాంటి పరిష్కారాలను చూస్తుంటాం. కానీ ఒక్కోసారి వీటివల్ల సమస్య తగ్గకపోగా మరింత దెబ్బతింటుంది. కానీ ఈ సారి మీరు ఈ సింపుల్‌ ఇంటి చిట్కాను పాటించండి. కొన్ని వారాల్లోనే సత్ఫలితం కనపడుతుంది. కొబ్బరి నూనెలో నిమ్మరసం జుట్టు ఆరోగ్యంగా, దృఢంగా ఉండేందుకు మంచి నాణ్యమైన కొబ్బరి నూనె తప్పనిసరిగా వాడతాం. అయితే చుండ్రు సమస్య ఉన్నవారు ఈ సారి కొబ్బరి నూనెలో కాస్త నిమ్మరసం కలిపి తలకు అప్లై చేయండి. ఈ కాంబినేషన్‌ వల్ల మెరుగైన ఫలితాలు కనిపిస్తాయి. ఇలా అప్లై చేయండి నిమ్మరసంలో విటమిన్‌ సితో పాటు యాంటీ ఫంగల్ గుణాలు పుష్కలంగా ఉంటాయి. దీన్నిఇ తలకు పట్టించడం ద్వారా ఫంగస్‌ను, మృత కణాలను సమూలంగా తొలగిస్తుంది. ఒక స్పూన్‌ నిమ్మరసంలో రెండు స్పూన్ల కొబ్బరి నూనె కలిపి తలకు మర్దన చేసుకోండి. దూదితో తల చర్మం భాగంలో అప్లై చేసుకోవడం ద్వారా చుండ్రును ప్రభావవంతంగా తొలగిస్తుంది. వారానికి రెండు సార్లు అప్లై చేసిన ఒక 30 నిమిషాల తర్వాత గాఢత తక్కువగా ఉన్న షాంపూతో సున్నితంగా తలస్నానం చేయండి. ఇలా వారానికి ఒకటి లేదా రెండు సార్లు చేయడం ద్వారా చుండ్రు సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు. అంతేకాకుండా జుట్టు సహజంగా మెరుస్తూ కనిపిస్తుంది. కుదుళ్ల పోషణకు దోహదపడుతుంది.

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్