సలాడ్స్... చలి కాలంలో జీర్ణక్రియను మెరుగుపరచడానికి, బరువు అదుపులో ఉంచుకోవడానికి బాగా పని చేస్తాయి. తాజా కూరగాయలు, తృణధాన్యాలు, నువ్వులు, మిరియాల పొడి లాంటి సహజమైన వెచ్చదనాన్ని ఇచ్చే పదార్థాలతో వీటిని సులభంగా తయారు చేసుకోవచ్చు. శీతాకాలంలో మీ రోగనిరోధక శక్తిని పెంచి, శరీరాన్ని వెచ్చగా ఉంచే నాలుగు అద్భుతమైన సలాడ్ రెసిపీలు ఇక్కడ ఉన్నాయి. అవి ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం.
శనగలతో...
కావల్సిన పదార్థాలు: నల్ల శనగలు - కప్పు (రాత్రంతా నానబెట్టి ఉడికించినవి), ఉల్లిగడ్డ ముక్కలు -పావుకప్పు, టమాటా ముక్కలు - పావు కప్పు, పచ్చిమిర్చి - ఒకటి (సన్నగా తరిగినవి), అల్లం తురుము - అర స్పూను, నిమ్మరసం - స్పూన్, జీలకర్ర పొడి - అర టీస్పూను, కొత్తిమీర - కొద్దిగా, ఉప్పు - తగినంత.
తయారు చేసే విధానం: ఉడికించిన శనగలు ఒక గిన్నెలో తీసుకోవాలి. అందులో తరిగిన ఉల్లిగడ్డ, టమాటా, పచ్చిమిర్చి, అల్లం తురుము వేయాలి. తగినంత ఉప్పు, జీలకర్ర పొడి, నిమ్మరసం పిండుకోవాలి. చివరగా కొత్తిమీర చల్లి బాగా కలిపి సర్వ్ చేసుకోవాలి.
స్వీట్ కార్న్ - క్యాప్సికంతో...
కావల్సిన పదార్థాలు: ఉడకబెట్టిన స్వీట్ కార్న్ - కప్పు, తరిగిన క్యాప్సికం (గ్రీన్/ఎల్లో) - అర కప్పు, ఉల్లిగడ్డ - ఒకటి (సన్నగా తరిగినది), చాట్ మసాలా - అర స్పూను, నెయ్యి లేదా బటర్ - టీస్పూను, నిమ్మరసం - టీస్పూను, ఉప్పు - తగినంత.
తయారు చేసే విధానం : పాన్‌లో కొద్దిగా నెయ్యి వేసి, తరిగిన క్యాపిసకం ముక్కలను నిమిషం పాటు తేలికగా వేయించాలి. అందులో ఉడకబెట్టిన స్వీట్ కార్న్ వేసి కలపాలి. స్టవ్ ఆఫ్ చేశాక ఉల్లిగడ్డ ముక్కలు, చాట్ మసాలా, ఉప్పు నిమ్మరసం వేసి వేడివేడిగా సర్వ్ చేయాలి.
నువ్వులు - క్యారెట్‌తో...
కావాల్సిన పదార్థాలు: క్యారెట్ తురుము - కప్పు, తెల్ల నువ్వులు (వేయించినవి) - రెండు స్పూన్లు, దానిమ్మ గింజలు - అరకప్పు, ఆలివ్/నువ్వుల నూనె - టీస్పూను, తేనె - టీస్పూను, నిమ్మరసం -స్పూన్, ఉప్పు, మిరియాల పొడి - చిటికెడు.
తయారీ విధానం : ఒక గిన్నెలో క్యారెట్ తురుము, దానిమ్మ గింజలను వేసుకోవాలి. వేయించిన నువ్వులు కలపాలి. వేరుగా నిమ్మరసం, తేనె, ఆలివ్ నూనె, మిరియాల పొడి ఉప్పును, బాగా కలిపి డ్రెస్సింగ్ తయారు చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని క్యారెట్ తురుములో వేసి బాగా కలిపి సర్వ్ చేసుకోవాలి.
పెసరపప్పు - కీరదోసతో...
కావల్సిన పదార్థాలు : పెసరపప్పు - అర కప్పు (గంట నానబెట్టినది), కీరదోస ముక్కలు - అర కప్పు, కొబ్బరి తురుము - స్పూన్, మిరియాల పొడి - అర టీస్పూను, నిమ్మరసం - టీస్పూను, ఉప్పు - తగినంత.
తయారు చేసే విధానం: నానబెట్టిన పెసరపప్పులోని నీరు పూర్తిగా వంపేయాలి. దానికి సన్నగా తరిగిన కీర - అవసరమైతే పీఎం 2.5, వీవోసీలను తగ్గించే హెపాయాక్టివేటెడ్ కార్బన్ ఫిల్టర్లు ఉన్న ఎయిర్ ప్యూరిపైయర్ ఉపయోగించాలి.





కామెంట్లు (0)