నవతెలంగాణ-మద్నూర్
మండల కేంద్రంలోని ఐకేపీ కార్యాలయంలో శనివారం మండల మహిళా సమాఖ్య సర్వసభ్య సమావేశం ఏపీఎం జగదీష్ కుమార్ అధ్యక్షతన జరిగింది. ముందుగా సభ్యులందరి సమక్షంలో ఆడిట్ నిర్వహించారు. ఈ సమావేశానికి ఎంపీడీఓ సాయిలు ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ మాట్లాడుతూ.. 2025-26 ఆర్థిక సంవత్సరంలో మండల సమాఖ్య ఆదాయం రూ.5,86,413/- సమకూరినట్టు చెప్పారు. మండలంలోని మహిళలందరూ సంఘాలో తప్పని సరిగా ఉండాలని సూచించారు. దీనిద్వారా మహిళలు ఆర్థికంగా బలోపేతం అవుతారని చెప్పారు.
ఈ సమావేశంలో మద్నూర్ మండల సమాఖ్య నూతన పాలక వర్గ సభ్యులను ఎన్నుకున్నారు. షేక్ హసీనా బేగం అధ్యక్షురాలు (తడి హిప్పర్గ గ్రామసంఘం), పాంచల్ ప్రేమల కార్యదర్శి తెలంగాణ బతుకమ్మ గ్రామ సంఘం మద్నూర్, అనీసా బేగం..కోశాధికారిగా (రుసేగావ్ గ్రామసంఘం) ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి మద్నూర్ మండల అన్ని గ్రామ సంఘాల అధ్యక్షురాళ్ళు, సీసీలు, అకౌంటెంట్ నర్సింగ్ పాల్గొన్నారు.
అభివృద్ధి పథంలో మండల సమైక్య
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



