Wednesday, July 29, 2026
E-PAPER
Homeఆదిలాబాద్చింతగూడ బొమ్మన రోడ్డుపై కూలిన భారీ వృక్షం

చింతగూడ బొమ్మన రోడ్డుపై కూలిన భారీ వృక్షం

- Advertisement -

​స్తంభించిన ట్రాఫిక్..
జెసిబితో వెంటనే తొలగింపజేసిన ఎస్ఐ ఉదయ్ కిరణ్
నవతెలంగాణ-జన్నారం

మండలంలోని చింతగూడ – బొమ్మన ప్రధాన రహదారిపై గత మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు హఠాత్తుగా ఓ భారీ వృక్షం విరిగిపడింది. దీంతో తీవ్ర ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. ఆదిలాబాద్ నిర్మల్ మంచిర్యాల వెళ్లే వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. రహదారికి ఇరువైపులా వాహనాలు భారీగా నిలిచిపోయి ప్రయాణికులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. విషయం తెలుసుకున్న వెంటనే స్థానిక ఎస్ఐ ఉదయ్ కిరణ్ తన సిబ్బందితో కలిసి హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. పరిస్థితిని సమీక్షించిన ఆయన, ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే జెసిబి యంత్రాన్ని తెప్పించారు. పడిపోయిన చెట్టు కొమ్మలను త్వరితగతిన తొలగించి, రోడ్డును పునరుద్ధరించారు. ఎస్ఐ ఉదయ్ కిరణ్ సమయస్ఫూర్తితో వ్యవహరించి, ట్రాఫిక్‌ను త్వరగా క్లియర్ చేయడంతో వాహనదారులు, స్థానిక ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. ఆపద సమయంలో తక్షణమే స్పందించి రాకపోకలను పునరుద్ధరించిన ఎస్ఐకి ప్రయాణికులు కృతజ్ఞతలు తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -