Friday, August 14, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్సీజనల్ వ్యాధుల నివారణకు చర్యలు చేపట్టాలి

సీజనల్ వ్యాధుల నివారణకు చర్యలు చేపట్టాలి

- Advertisement -

అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు ఖిమ్యా నాయక్
కొత్తకోట మున్సిపాలిటీ, దంతనూరు ప్రాంతాల్లో డ్రై డే కార్యక్రమాల పరిశీలన
నవతెలంగాణ-వనపర్తి 

పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి సారించి సీజనల్ వ్యాధుల నివారణకు ముందస్తు చర్యలు చేపట్టాలని అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు ఖిమ్యా నాయక్ అధికారులను ఆదేశించారు. కొత్తకోట మున్సిపాలిటీలో ప్రభుత్వ ఆసుపత్రి ప్రాంతంలో నిర్వహించిన డ్రై డే కార్యక్రమాన్ని అదనపు కలెక్టర్ ఖిమ్యా నాయక్ శుక్రవారం పరిశీలించారు. వర్షాకాలం నేపథ్యంలో పారిశుద్ధ్య నిర్వహణ, దోమల నివారణ, సీజనల్ వ్యాధుల నియంత్రణకు అవసరమైన ముందస్తు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.  మున్సిపాలిటీ పరిధిలోని పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడంతో పాటు నీరు నిల్వ ఉండే ప్రాంతాలను గుర్తించి, ఎప్పటికప్పుడు నీటిని తొలగించాలని సూచించారు.

దోమల వృద్ధికి అవకాశం లేకుండా ప్రత్యేక పారిశుద్ధ్య చర్యలు చేపట్టాలని, ప్రజలకు సీజనల్ వ్యాధులపై అవగాహన కల్పించాలని తెలిపారు. అనంతరం కొత్తకోట ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించిన అదనపు కలెక్టర్, అక్కడ అందుతున్న వైద్య సేవలు, సిబ్బంది అందుబాటు, వర్షాకాలంలో వచ్చే సీజనల్ వ్యాధులను ఎదుర్కొనేందుకు చేపట్టిన ముందస్తు ఏర్పాట్లపై వైద్యాధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రజలకు సకాలంలో నాణ్యమైన వైద్య సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. పాఠశాల విద్యార్థుల యూనిఫాం కుట్టింపు, పంపిణీ పురోగతిపై అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. యూనిఫాం పంపిణీ ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు.

    అనంతరం మదనాపూర్ మండలం దంతనూరు గ్రామంలో డ్రై డే కార్యక్రమాన్ని అదనపు కలెక్టర్ పరిశీలించారు. గ్రామంలోని పారిశుద్ధ్య నిర్వహణ, పరిసరాల పరిశుభ్రతను పరిశీలించి, వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు వ్యాప్తి చెందకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. గ్రామంలో నీరు నిల్వ ఉండే ప్రదేశాలను గుర్తించి శుభ్రం చేయాలని, పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. అనంతరం దంతనూరు గ్రామ పంచాయతీ కార్యాలయాన్ని సందర్శించిన అదనపు కలెక్టర్, గ్రామ పంచాయతీ కార్యకలాపాలు, పారిశుద్ధ్య నిర్వహణకు సంబంధించిన వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. గ్రామంలో పారిశుద్ధ్య నిర్వహణను నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్, మున్సిపల్ చైర్‌పర్సన్, కౌన్సిలర్లు, వైద్యాధికారి, ఆశా కార్యకర్తలు, పంచాయతీ అధికారులు, సంబంధిత సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -