నవతెలంగాణ – పెద్దవంగర
కొరిపల్లి సర్పంచ్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు రంగు మురళి తల్లి వినోద (76) వృద్ధాప్యంతో ఇటీవల మృతి చెందారు. పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి వారి నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. వినోద చిత్రపటానికి ఎమ్మెల్యే నివాళులర్పించి, ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ విషాదాన్ని ధైర్యంగా ఎదుర్కోవాలని సూచించారు. కాంగ్రెస్ పార్టీ కుటుంబానికి ఎల్లప్పుడూ అండగా ఉంటుందని, అవసరమైన ప్రతి సందర్భంలో తమ సహకారం ఉంటుందని ఎమ్మెల్యే యశస్విని రెడ్డి భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మండల సీనియర్ నాయకులు పొడిశెట్టి సైదులు, దుంపల కుమారస్వామి, దాసరి శ్రీనివాస్, ఓరిగంటి సతీస్, బానోత్ సీతారాం, వెంకన్న, సోమన్న, నరేష్ మహేష్ తదితరులు పాల్గొన్నారు.
రంగు మురళిని పరామర్శించిన ఎమ్మెల్యే
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



