Monday, August 3, 2026
E-PAPER
Homeక్రైమ్ఎన్‌కౌంటర్‌లో మోస్ట్‌ వాంటెడ్‌ గ్యాంగ్‌స్టర్‌ హతం

ఎన్‌కౌంటర్‌లో మోస్ట్‌ వాంటెడ్‌ గ్యాంగ్‌స్టర్‌ హతం

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ :జార్ఖండ్‌లో మోస్ట్‌ వాంటెడ్‌ గ్యాంగ్‌స్టర్‌ సుజిత్‌ సిన్హా పోలీసుల ఎన్‌కౌంటర్‌లో మృతిచెందాడు. సాహిబ్‌గంజ్‌ జైలు నుంచి ధన్‌బాద్‌కు తరలిస్తుండగా మార్గమధ్యలో మరుగుదొడ్డికి వెళ్లాలని చెప్పి వాహనం ఆపించాడు. ఈ సమయంలో ఓ పోలీసు వద్ద ఉన్న రైఫిల్‌ను లాక్కొని పారిపోతూ కాల్పులు జరిపినట్లు పోలీసులు తెలిపారు. ఆత్మరక్షణలో పోలీసులు ఎదురుకాల్పులు జరపగా అతడు తీవ్రంగా గాయపడ్డాడు. ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. హత్యలు, వసూళ్లు సహా పలు కేసుల్లో నిందితుడైన సుజిత్‌ సిన్హా చాలాకాలంగా జార్ఖండ్‌ పోలీసుల మోస్ట్‌ వాంటెడ్‌ జాబితాలో ఉన్నాడు. ఘటనపై ఉన్నతాధికారులు దర్యాప్తు చేపట్టారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -