మరోసారి వాయిదాపడిన కృష్ణా బోర్డు సమావేశం
తెలుగు రాష్ట్రాలకు కీలక సూచనలు
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్
కృష్ణాబోర్డు పరిధిలో నీటి పంపకాల విషయంలో శుక్రవారం జరిగిన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ఈఎన్సీల సమావేశం మరోసారి వాయిదా పడింది. ఈ సమావేశంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకోకుండానే సెప్టెంబర్ నాలుగో వారంలో మరోసారి కృష్ణా బోర్డు త్రిసభ్య కమిటీ పూర్తి స్థాయిలో నిర్వహించి నీటి వాటాల విషయంలో నిర్ణయం తీసుకోవాలని బోర్డు అధికారులు నిర్ణయించారు. ఈ సమావేశానికి కేఆర్ఎంబీ చైర్మెన్ సుభ్రాంగ్స్ బిస్వాస్ అధ్యక్షత వహించగా, సభ్య కార్యదర్శి సతీష్‌కుమార్ కంబోజ్ పాల్గొన్నారు.
50 శాతం వాటా అడిగాం :
తెలంగాణ ఈఎన్సీ రమేశ్ బాబు
బోర్డు సమావేశానికి హాజరైన తెలంగాణ ఈఎన్సీ రమేష్ బాబు మాట్లాడుతూ తాగు నీటిపై త్రిసభ్య కమిటీ సమావేశంలో చర్చ జరిగిందని వివరించారు. ఎల్ నినో ఉన్నందున తాగునీటి కోసం చేరో 50శాతం వాటా తీసుకోవాలని తెలంగాణ కోరగా, ఏపీ పాత పద్ధతిన 66:34 వాటా లెక్కన పంపిణి చేయాలని డిమాండ్ చేసిందని వెల్లడించారు. 66:34 నిష్పత్తి డిమాం డ్ ను మూడేండ్లుగా తాము అంగీ కరించడం లేదని తెలిపారు. ఇప్పటికే పోతిరెడ్డిపాడు నుంచి ఏపీ నిబంధ నలకు విరుద్ధంగా నీళ్లను తీసుకు పోతున్నదని విమర్శించారు. తాజాగా ఇప్పుడు వెలిగొండ నుంచి కూడా నీరు తీసుకోవడాన్ని ప్రశ్నిం చారు. వెంటనే ఆపాలని డిమాండ్ చేశారు. మొత్తం గా తెలంగాణ 200 టీఎం సీలు, ఏపీ 100 టీఎంసీలను అడిగిందని అన్నారు. ఈ నెల నాలు గో వారంలో జరిగే బోర్డు సమావేశంలో పూర్తి స్థాయిలో చర్చించి నిర్ణయాలు తీసుకుంటామని చెప్పారు.
అవసరం లేకున్నా శ్రీశైలంలో విద్యుత్ ఉత్పత్తి :
ఏపీ ఈఎన్సీ నరసింహమూర్తి
సమావేశానికి వచ్చిన ఏపీ ఈఎన్సీ నరసింహమూర్తి మాట్లా డుతూ త్రిసభ్య కమిటీ సమావే శంలో ఏకాభిప్రాయం కుదరలే దన్నారు. 66:34 నిష్పత్తిలో ఏపీ, తెలంగాణకు నీటి విడుదల ఉత్తర్వులు ఇవ్వాలని కోరామని తెలిపారు. ఎల్ నినో ఉన్నందున తాగునీటి కోసం 50:50 నిష్పత్తిలో ఇవ్వాలని తెలం గాణ కోరిందనీ, వచ్చే ఆగస్టు వరకు 104 టీఎంసీలు కావాలని కోరామని వివరిం చారు. తెలంగాణ 200 టీఎంసీలు కావాలని కోరిందనీ, ఆ ప్రతిపాదన సహేతుకం కాదని తాము చెప్పామని అన్నారు. తెలం గాణ అవసరం లేకున్నా శ్రీశైలంలో విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నదని ఆరోపిం చారు. తమ వాటా నుంచే పోతిరెడ్డి పాడు, వెలిగొం డ ద్వారా నీరు తీసుకుంటున్నామనీ, ఎవరి వాటా అడగడం లేదని తెలిపారు. రాయలసీ మతో పాటు మార్కాపురం, పల్నాడు, ఇతర జిల్లాలకు తాగునీటి అవసరాల కోసం నీరు ఇవ్వాల్సి ఉందన్నారు.
తాగునీటికే ప్రాధాన్యం
పలు సూచనలు చేసిన బోర్డు
కృష్ణా బోర్డు సమావేశాన్ని వాయిదా వేస్తూ అధికారులు తెలుగు రాష్ట్రాలకు పలు సూచనలు చేశారు. విద్యుత్ ఉత్పత్తి కోసమే జలాశ యాల నుంచి నీటిని కిందకు విడు దల చేయడం సరికాదని చెప్పారు. అలాగే పోతిరెడ్డిపాడు నుంచి నీటి విడుదలను సైతం నియంత్రించాలని సూచించారు. రెండు రాష్ర్టాల తాగు నీటి అవసరాలను మాత్రమే పరిగణ న లోకి తీసుకోవాలని ఆదేశించింది. ఉమ్మడి జలాశయాల్లో నీరు తక్కువ గా ఉన్న నేపథ్యంలో పొదుపుగా వాడుకోవాలని చెప్పింది. కష్టకాలం లో తాగునీటికే ప్రాధాన్యత ఇవ్వాల ని విభజన చట్టం చెబుతున్నదని బోర్డు గుర్తుచేసింది.



