25 టీచర్ పోస్టులు 10 హెల్పర్ పోస్టుల కు దరఖాస్తుల ఆహ్వానం: సిడిపిఓ కళావతి
నవతెలంగాణ-మద్నూర్
మద్నూర్ ఐసిడిఎస్ ప్రాజెక్టు పరిధిలోని మద్నూర్, జుక్కల్, బిచ్కుంద ,డోంగ్లి ,పెద్ద కొడపుగల్ ఈ ఐదు మండలాల పరిధిలో అంగన్వాడీ టీచర్ పోస్టులు 25 హెల్పర్ పోస్టులు 10 ఖాళీగా ఉన్న వాటికి భర్తీ కోసం నోటిఫికేషన్ జారీ అయినట్లు, మద్నూర్ ఐసిడిఎస్ ప్రాజెక్టు సిడిపిఓ కళావతి రాథోడ్ గురువారం ఒక ప్రకటన ద్వారా విలేకరులకు తెలియజేశారు. ఈ పోస్టుల భర్తీ కోసం ఈనెల 9 నుండి ఈనెల 25 వరకు అర్హులైన వారు దరఖాస్తులు చేసుకోవచ్చని సిడిపిఓ తెలిపారు. ఈ పోస్టుల భర్తీకి 1/7/ 2026 నాటికి 18 సంవత్సరాలు నిండి 35 సంవత్సరాల లోపు వయస్సు ఉండాలని తెలిపారు దరఖాస్తు చేసుకోబోయే మహిళలు అంగన్వాడి కేంద్రానికి తప్పనిసరిగా స్థానిక వాస్తవ్యులై ఉండాలని తెలిపారు.
ప్రాజెక్టు పరిధిలోని మండలాల వారీగా ఖాళీగా ఉన్న పోస్టులు వాటి రిజర్వేషన్లు ఈ విధంగా ఉన్నాయి. మద్నూర్ మండలంలోని సోమూర్ అంగన్వాడి టీచర్ పోస్టును ఈడబ్ల్యూఎస్ కు కేటాయించారు. మెక్కా బిసి బి, హెచ్ కేలూర్1 ఓసి, హెచ్ కేలూర్ 2 ఓసి, డోంగ్లి మండలంలో రుశేగావ్ ఓసి, రాచూర్ విహెచ్పిహెచ్ విజువల్, మారేపల్లి విహెచ్పిహెచ్ హిరింగు స్పీచ్, బిచ్కుంద మండలంలో బిచ్కుంద వార్డు 9 ఓసి, బిచ్కుంద వార్డు 12 ఓసి, బిచ్కుంద వార్డు4 ఈడబ్ల్యూఎస్, బిచ్కుంద వార్డు7 ఓసి, సిరిసముందర్ ఈడబ్ల్యూఎస్, పుల్కల్ 2 ఓసి, శాంతాపూర్ మెట్టు తాండ ఎస్టి ఏర్మమార్క్, జుక్కల్ మండలంలో హంగార్గా ఎస్సీ గ్రూప్ టు ఎర్మమార్క్, బిజల్వాడి ఓసి ఎక్స్ సర్వీస్మెన్, ఏడిగీ 2 బిసి సి, వజ్రకండి మైలర్ ఎస్సీ గ్రూప్ 2 ఏర్మ మార్క్, పెద్ద గుల్ల వన్ ఈడబ్ల్యూఎస్, కంటాలి బిసిఇ , జుక్కల్ 2 ఎస్ సి గ్రూప్ టు ఏర్మమార్క్, పెద్ద కోడప్పుగల్ మండలంలో విట్టల్ వాడి ఓసి కాస్లాబాద్ బీసీ బి, ఈ విధంగా అంగన్వాడీ టీచర్ పోస్టులకు రిజర్వేషన్లు ప్రకటించారు.
ఇక 10 హెల్పర్ పోస్టులకు మండలాల వారీగా ఖాళీ పోస్టులు వాటి రిజర్వేషన్లు ఈ విధంగా ఉన్నాయి.బిచ్కుంద వార్డ్ 5 కందార్పల్లి ఎస్టి, బిచ్కుంద సీతారాం పల్లి ఎస్టి, బిచ్కుంద శాంతాపూర్ మెట్టు తండా ఎస్టీ, పెద్ద కోడప్పుగల్ మండలం అంజలి విలేజ్ ఎస్టి, విట్టల్ వాడి ఎస్టి, బేగంపూర్ తాండ ఎస్టీ, తలాబ్ తాండ ఎస్టి, సముందర్ తాండ ఎస్టి, సముందర్ తాండ మన్పు తాండ ఎస్టి, డోంగ్లి మండలం గోజేగావ్ ఎస్టి, ఈ విధంగా హెల్పర్ పోస్టులు ఖాళీగా ఉన్నట్లు సిడిపిఓ వివరించారు.



