Sunday, July 5, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్కేటీఆర్ పర్యటనను అడ్డుకోవడం ప్రజాస్వామ్య విరుద్ధం

కేటీఆర్ పర్యటనను అడ్డుకోవడం ప్రజాస్వామ్య విరుద్ధం

- Advertisement -

కాంగ్రెస్ ప్రభుత్వంపై బిఆర్ఎస్ నాయకుల మండిపాటు
నవతెలంగాణ – పరకాల 

కాళేశ్వరం ప్రాజెక్టులోని కన్నెపల్లి పంప్‌హౌస్ పర్యటనకు వెళ్లకుండా పరకాల బిఆర్ఎస్ నాయకులను రేవంత్ ప్రభుత్వం ముందస్తుగా అరెస్టు చేయడంపై ఆ పార్టీ నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కాళేశ్వరం నీటిని వృథా చేయకుండా, వెంటనే పంప్‌హౌస్ మోటార్లు ఆన్ చేసి ఆయకట్టు రైతులను ఆదుకోవాలనే సదుద్దేశంతో కేటీఆర్ చేపట్టిన పర్యటనను అడ్డుకోవడం ప్రజాస్వామ్య విరుద్ధమని వారు పేర్కొన్నారు. ప్రజా సమస్యలపై ప్రతిపక్షాలు గళమెత్తుతుంటే, కాంగ్రెస్ ప్రభుత్వం పోలీసులను ప్రయోగించి అణచివేయాలని చూడటం దుర్మార్గమని మాజీ వ్యవసాయ మార్కెట్ చైర్మన్ బండి సారంగపాణి విమర్శించారు. రైతుల పక్షాన నిలబడి ప్రశ్నిస్తున్న నాయకులపై ఉక్కుపాదం మోపుతూ, భయభ్రాంతులకు గురిచేయడం ద్వారా ప్రభుత్వం నిజాలను దాచలేదని వారు స్పష్టం చేశారు. అరెస్ట్ అయిన వారిలో కొక్కిరాల రాకేష్ రావు, గందే వెంకన్న, కౌన్సిలర్లు దుబాసి వెంకటస్వామి, బొచ్చు బాబురావులతో పాటు శనిగరపు నవీన్, పాడి భగవాన్ రెడ్డి, ఎండీ హమీద్, బండి వెంకటేష్, దుప్పటి సుజన్ రానా, బొట్ల నరేష్, బొచ్చు బిక్షపతి, కృపేందర్ రెడ్డి, మొరే రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -