Wednesday, August 5, 2026
E-PAPER
Homeఆటలువన్డే ప్రపంచకప్..క్వాలిఫైయర్ తేదీలు ఖరారు

వన్డే ప్రపంచకప్..క్వాలిఫైయర్ తేదీలు ఖరారు

- Advertisement -

నవతెలంగాణ-హైదరాబాద్: వన్డే ప్రపంచకప్-2027 క్వాలిఫైయర్ టోర్నమెంట్‌ తేదీలను అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) ఖరారు చేసింది. దక్షిణాఫ్రికా, జింబాబ్వే, నమీబియా వేదికగా వచ్చే ఏడాది అక్టోబర్‌లో మెగా టోర్నీ జరగనుంది. దీని కోసం జరిగే ఈ అర్హత మ్యాచ్‌లు వచ్చే ఏడాది ఫిబ్రవరి 22 నుంచి మార్చి 23 వరకు నిర్వహించనున్నట్లు సమాచారం. అయితే, ఈ క్వాలిఫైయర్ మ్యాచ్‌లకు వేదికలను మాత్రం ఐసీసీ ఇంకా అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. ఈ క్వాలిఫైయర్ టోర్నమెంట్‌లో మొత్తం 10 జట్లు తలపడనున్నాయి. ఇందులో విజేతగా నిలిచిన జట్టు నేరుగా ప్రపంచకప్ ప్రధాన టోర్నమెంట్‌కు అర్హత సాధిస్తుంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -